Punjab Congress : పంజాబ్‌ కాంగ్రెస్‌లో కుమ్ములాట, పోస్టర్ వార్

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్​ సింగ్​, అమృత్​సర్​ ఎమ్మెల్యే నవజ్యోత్​ సిద్ధూల మధ్య వార్‌ కొనసాగుతోంది. ఇద్దరు నేతల పోస్టర్లు రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. నవజ్యోత్​ సింగ్​ కనిపించడంలేదని అమృత్​సర్​లో పలుచోట్ల పోస్టర్​లు వెలిశాయి. సిద్ధూని పట్టిస్తే, 50 వేల రూపాయల రివార్డని ప్రకటించారు

Punjab Congress : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్​ సింగ్​, అమృత్​సర్​ ఎమ్మెల్యే నవజ్యోత్​ సిద్ధూల మధ్య వార్‌ కొనసాగుతోంది. ఇద్దరు నేతల పోస్టర్లు రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. నవజ్యోత్​ సింగ్​ కనిపించడంలేదని అమృత్​సర్​లో పలుచోట్ల పోస్టర్​లు వెలిశాయి. సిద్ధూని పట్టిస్తే, 50 వేల రూపాయల రివార్డని ప్రకటించారు. షాహిద్​ బాబా దీప్​ సింగ్​ సేవా సోసైటీ తప్పిపోయిన ఎమ్మెల్యేను వెతకండంటూ పోస్టర్లను జారీచేసింది. మరోవైపు అమరీందర్‌సింగ్‌కు వ్యతిరేకంగా పాటియాలలో కూడా కొన్ని పోస్టర్​లు వెలిశాయి. గత కొన్ని రోజులుగా సిద్ధూ కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ను టార్గెట్‌ చేస్తున్నారు.

పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కుమ్ములాట తారాస్థాయికి చేరింది. ఈ వివాదం కాస్తా ఢిల్లీ హైకమాం​డ్‌ వద్దకు చేరింది. కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ పనితీరుపై 20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని పలు నివేదికలు కాంగ్రెస్​కు చేరాయి. దీని వెనుక సిద్ధూ హస్తం ఉందని భావిస్తున్నారు. వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్​ అధిష్ఠానం మల్లికార్జున్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్​ను నియమించింది. పంజాబ్​ కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జ్​ హరిష్​ రావత్​, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్​ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఏడాది పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీలో నెలకొన్న అసంతృప్తిను చల్లార్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం యత్నిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు