No Confidence Motion: మోదీది తక్కువ కులం కాబట్టే.. పార్లమెంటులో రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ బీజేపీ నేత

రాహుల్‌ పార్లమెంట్‌లో ముందుగా మాట్లాడబోతున్నారని వార్తలు వచ్చాయని, అయితే ఆయన ఆలస్యంగా లేవడం వల్ల ఆయన మాట్లాడలేకపోయారంటూ దూబే సెటైర్లు విసిరారు

No Confidence Motion: మోదీది తక్కువ కులం కాబట్టే.. పార్లమెంటులో రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ బీజేపీ నేత

Parliament Monsoon Session: కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకి ప్రభుత్వం తరపున మొదట మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన ప్రసంగం ప్రారంభించడంతోనే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. ఇక మోదీ ఇంటి పేరుతో రాహుల్ చేసిన వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి మోదీకి క్షమాపణలు చెప్పనంటూ రాహుల్ గాంధీ అనడాన్ని ఆధిపత్య కులభావనగా దూబే అన్నారు.

Manmohan Singh : 90 ఏళ్ల వయస్సులో వీల్ చైర్‌లో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ..

మోదీది చాలా చిన్న కులమని, ఆయన ఓబీసీ అని, అందుకే రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడానికి ఇష్టపడడం లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ‘క్షమాపణలు చెప్పేందుకు తాను సావర్కర్ కాను’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చూస్తూ ‘‘నువ్వు (రాహుల్) సావర్కర్ ఎప్పటికీ కాలేవు. ఆయన (సావర్కర్) 28 ఏళ్లు జైలులో ఉన్నారు. ఈ వ్యక్తులు (కాంగ్రెస్) ఇండియా గురించి మాట్లాడతారు. కానీ ప్రతిపక్ష ఎంపీలందరికీ దాని పూర్తి రూపం ఏంటో తెలియదు’’ అని అన్నారు.

High Court : భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే.. ఆ జంటకు విడాకులు మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు

రాహుల్‌ పార్లమెంట్‌లో ముందుగా మాట్లాడబోతున్నారని వార్తలు వచ్చాయని, అయితే ఆయన ఆలస్యంగా లేవడం వల్ల ఆయన మాట్లాడలేకపోయారంటూ దూబే సెటైర్లు విసిరారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ దూబేపై విరుచుకుపడ్డారు. ప్రజల త్యాగాల గురించి అధికార పార్టీకి తెలియదని, వారు మణిపూర్‌ని చూడలేదని విమర్శించారు. తాను మణిపూర్ చరిత్రకు బాధితుడినని, తన మేన మామ ఎన్‌కే తివారీ 1973లో మణిపూర్‌లో కాలు కోల్పోయిన విషయాన్ని గోగోయ్ గుర్తు చేశారు.