Supreme Court : రైలు ప్రయాణంలో రూ.లక్ష చోరీ కేసు, సుప్రీంకోర్టు కీలక తీర్పు

రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి డబ్బు చోరీ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టుకు కీలక వ్యాఖ్యలు చేస్తు తీర్పునిచ్చింది.

Supreme Court : రైలు ప్రయాణంలో రూ.లక్ష చోరీ కేసు, సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court

Updated On : June 17, 2023 / 12:39 PM IST

Supreme Court : రైల్లో ప్రయాణించే సమయంలో తన రూ.లక్షలు చోరీ అయ్యాయని ఆ డబ్బు రైల్వే శాఖ ఇవ్వాలి అని కోరుతు ఓ ప్రయాణీకుడు వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు(Supreme Court )కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఫిర్యాదుపై గతంలో వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. 2005లో జరిగిన ఈ ఘటనపై తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court )కీలక తీర్పునిస్తు..ప్రయాణంలో జరిగే చోరీ రైల్వే సేవల లోపం కిందికి రాదని పేర్కొంది.

ఈ తీర్పు సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్(Justices Vikram Nath), జస్టిస్ అహ్ సానుద్దీన్ అమానుల్లా(Justice Ahsanuddin Amanullah)లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రైలు ప్రయాణంలో చోరీ జరిగితే అది రైల్వే శాఖ బాధ్యత కాదని..ప్రయాణంలో జరిగిన దొంగతనానికి రైల్వే శాఖ బాధ్యత వహించదని స్పష్టం చేస్తు శుక్రవారం (జూన్ 16,2023) ఈ కేసు కొట్టివేసింది.

Assam flood worsens: కురుస్తున్న భారీవర్షాలు..వరదలతో అసోం అతలాకుతలం

2005లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేందర్ భోలా (Surendra Bhola)అనే బట్టల వ్యాపారి ఢిల్లీ వెళ్లేందుకు కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌ (Kashi Vishwanath Express train)లో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో అతని వద్ద ఉన్న రూ. లక్ష చోరీ అయ్యాయి. దీంతో ఆయన ఢిల్లీలో దిగాక పోలీస్ స్టేషన్‌ (Police station)లో ఫిర్యాదు చేశాడు. అనంతరం రైలులో చోరీ జరిగింది కాబట్టి ఆ డబ్బును రీఇంబర్స్ గా రైల్వేశాఖనుంచి ఇప్పించాలని కోరుతు వినియోగదారుల ఫోరాన్ని (Consumer Commission)ఆశ్రయించాడు.

వినియోగదారులు ఫోర్ అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో స్టేషన్ సూపరింటెంబెంట్ వినియోగదారుల ఫోర్ ఇచ్చిన తీర్పుని 2015లో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.కాగా ఈ తీర్పుని రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు (District and National Consumer Commission)కూడా తోసిపుచ్చాయి. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్ (Justices Vikram Nath), జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా(Justice Ahsanuddin Amanullah)తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పుని తప్పుపట్టారు.

Bipar-joy cyclone babies Born: గుజరాత్లో 707 మంది బిపర్ జోయ్ తుపాన్ శిశువులు జన్మించారు

ప్రయాణంలో చోరీ జరిగితే అది రైల్వే సేవల లోపం కిందకు రాదని..కానీ ప్రయాణంలో చోరీ రైల్వే సేవల లోపం కిందికి వస్తుందని వినియోగదారుల ఫోరం ఎందుకు చెప్పిందో అర్థం కావటంలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేనప్పుడు దానికి రైల్వే శాఖను బాధ్యుల్ని చేయడం సరికాదని మందలించారు. వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది.

 

,