ఉత్తరాదిలో అకాల వర్షాలు : 34 మంది మృతి
ఉత్తరాదిలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉత్తరాదిలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తరాదిలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లో 34 మృతి చెందారు. మధ్యప్రదేశ్ లో 16, గుజరాత్ లో 9, రాజస్తాన్ లో 9 మంది మరణించారు. భారీగా పంట, ఆస్తి నష్టం జరిగింది. గోదుమతోపాటు పలు పంటలకు నష్టం వాటిల్లింది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : అమ్మబాబోయ్ : సూర్యాపేటలో 20 కిలోల బంగారు నాణాలు స్వాధీనం
ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ, యూపీ, హర్యానాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. పశ్చిమ ప్రాంతం నుంచి వీచే గాలులు, అరేబియా సముద్రం మీదుగా వస్తున్న గాలులతో వాతావరణం మారుతోంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు.
6 people have died across Rajasthan, in the rain and storms which hit various parts of the state, yesterday. pic.twitter.com/jmWB8tHM3y
— ANI (@ANI) April 17, 2019