రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భావ్నా జాట్..టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 20 కిలోమీటర్ల నడక విభాగంలో ఆమె ఈ అర్హతను సాధించారు. ఈ సందర్భంగా భావ్నా సంతోషం వ్యక్తం చేసింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న ఆమె..పతకం సాధించేందుకు తాను కృషి చేస్తానని తెలిపింది.
భావ్నా కుటుంబ విషయాలకు వస్తే..రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ సమండ్ జిల్లాలోని కబ్రా గ్రామంలో ఓ పేద రైతు కుటుంబం. ఈమె అథ్లెట్. నడక పోటీల్లో ఈమె ప్రావిణ్యం సంపాదించింది. గత సంవత్సరం అక్టోబర్ నేషనల్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఉత్తమమైన ఆటతీరును కనబరిచింది. 1:38. 30 సెకన్లలో పూర్తి చేసింది. ప్రస్తుతం జరిగిన పోటీలో 1 గంట 29 నిమిసాల 54 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.
ఒలింపిక్‌కు అర్హత సాధించాలంటే..1:31:00 టార్గెట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గుర్ముఖ్ సిహాగ్ వద్ద భావ్నా ట్రైనింగ్ తీసుకొంటోంది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ క్యాంపులలో పాల్గొనలేదు. 2016లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొంది. పోటీల్లో పాల్గొని 5వ ప్లేస్‌లో నిలిచింది. తన కల నిజమైందని, ఒలింపిక్ మార్క్‌ను చేరుకోవాలని లక్ష్యంతో కృషి చేసినట్లు తెలిపారు. భావ్నా డోప్ శాంపిల్ ఇవ్వడం జరిగిందని కోచ్ గుర్ముఖ్ వెల్లడించారు.
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నుండి డోప్ శాంపిల్స్‌లను అథ్లెట్ల నుంచి తీసుకున్నారన్నారు. మార్చి 15వ తేదీ జపాన్‌లో జరిగే ఏషియా రేస్ వాక్ ఛాంపియన్ షిప్‌లో పాల్గనబోతోంది. తన సమయాన్ని మరింత మెరుగుపరుచుకుంటానని, సందీప్ కుమార్ తెలిపారు. ఇతను ఒలింపిక్స్‌కు ఉండే అర్హత సమయాన్ని చేరుకోలేకపోయాడు.
Read More : యూపీలో దారుణం : మహిళపై పోలీసుల అత్యాచారం!