Site icon 10TV Telugu

Rajasthan : రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మ మంత్రివర్గ విస్తరణ

Rajasthan Cabinet Expansion

Rajasthan : ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. 18 నుంచి 20 మంది కొత్త మంత్రులుగా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. మంత్రివర్గంలో అనుభవజ్ఞులు, కొత్త ముఖాలు కలగలిసి ఉండొచ్చన్న సంకేతాలు వెలువడినప్పటికీ, మంత్రిగా నియమితులైన వారి పేర్లను పార్టీ వెల్లడించలేదు.

ALSO READ : Vande Bharat trains : రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆరు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా

కేబినెట్‌ విస్తరణకు ముందు భజన్‌లాల్‌ శర్మ ఢిల్లీ వెళ్లి బీజేపీ కేంద్ర నేతలతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 200 మంది సభ్యుల రాజస్థాన్ శాసన సభలో బీజేపీ 115 స్థానాలను కైవసం చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. బీజేపీ మొదటి సారి ఎమ్మెల్యే అయిన భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాను ఎంపిక చేసింది.

ALSO READ : Cold day warning : ఢిల్లీలో తీవ్ర చలిగాలులు…ఐఎండీ కోల్డ్ డే హెచ్చరిక

ఐదవసారి బీజేపీ ఎమ్మెల్యే అయిన దేవ్‌నాని 16వ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. జనవరి 19వతేదీన గవర్నర్ ప్రసంగంతో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎంపీలుగా లోక్‌సభకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ALSO READ : Earthquake : మణిపూర్ ఉఖ్రూల్‌లో భూకంపం…భయాందోళనల్లో జనం

ఝోత్వారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సవాయ్ మాధోపూర్ స్థానం నుంచి కిరోడి లాల్ మీనా, తిజారా నియోజకవర్గం నుంచి బాబా బాలక్ నాథ్ లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. పశ్చిమ రాజస్థాన్‌లోని పోకరన్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ మంత్రిని ఓడించిన మహంత్ ప్రతాప్ పూరి, మాజీ మంత్రి ఐదుసార్లు ఎమ్మెల్యే అనితా భడేల్ మంత్రివర్గ రేసులో ఉన్నారు.

Exit mobile version