Rajasthan : బాలికపై అత్యాచారానికి పాల్పడిన రాజస్థాన్ పోలీసు ఉద్యోగం నుంచి తొలగింపు

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సర్వీసు నుంచి తొలగించినట్లు రాజస్థాన్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని తన మద్దతుదారులతో కలిసి ధర్నాకు దిగారు.

Rajasthan : బాలికపై అత్యాచారానికి పాల్పడిన రాజస్థాన్ పోలీసు ఉద్యోగం నుంచి తొలగింపు

Rajasthan Cop Dismissed

Updated On : November 12, 2023 / 3:03 PM IST

Rajasthan Cop Dismissed : రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణతో అరెస్టైన ఎస్ఐని సర్వీసు నుండి తొలగించారు. శుక్రవారం మధ్యాహ్నం నాలుగేళ్ల దళిత బాలికపై ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్ వెలుపల స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నిరసనకారులు నిందితుడైన పోలీసు అధికారిని దూషించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడింది ఎన్నికల విధుల్లో ఉన్న భూపేంద్ర సింగ్ (54)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు సబ్-ఇన్‌స్పెక్టర్ ఎన్నికల విధుల్లో నియమించబడ్డాడని, అద్దె గదిలో ఉంటున్నాడని తెలిపారు. నిందితుడు తన డ్యూటీ పూర్తి చేసిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినట్లు దౌసా అదనపు ఎస్పీ బజరంగ్ సింగ్ తెలిపారు. బాలిక ఏడుస్తూ తమ వద్దకు వచ్చిందని, దీంతో ఏదో అవాంఛనీయ సంఘటన జరిగిందనే అనుమానం వచ్చిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారని పేర్కొన్నారు. బాలిక చేతిలో రూ.50 నోటు ఉందని, సమాచారం ఆధారంగా సింగ్‌ను నిందితుడిగా గుర్తించామని ఏఎస్పీ తెలిపారు.

Rajasthan: రాజస్థాన్‌ దౌసాలో దారుణం.. నాలుగేళ్ల బాలికపై అత్యాచారంకు పాల్పడ్డ ఏఎస్ఐ.. స్థానికంగా ఉద్రిక్తత

బాధిత బాలిక వయస్సు 4-5 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్లు సహా పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంతో నిరసనలు ముగిశాయని ఏఎస్పీ తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సర్వీసు నుంచి తొలగించినట్లు రాజస్థాన్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని తన మద్దతుదారులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ ఘటనపై రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. కాగా, ఈ ఘటనను ఖండిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. వీలైనంత త్వరగా బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.