రాజస్థాన్‌లో గాలి దుమ్ముతో కూడిన తుఫాన్

ఒడిశాలో సంభవించిన ఫొని తుఫాన్ మరిచిపోక ముందే రాజస్థాన్‌లో మరో ప్రకృతి బీభత్సం జరగనుంది. వాతావరణంలోని వేగవంతమైన మార్పుల కారణంగా రాజస్థాన్‌లో వర్షాలు, గాలి దుమ్ముతో కూడిన తుఫాన్ రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ఒకటి రెండు రోజులు కాదు వారం రోజులకు పైగా ఉండి పీల్చుకోవడానికి గాలి దొరకక సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆరేబియా సముద్రంపై ఉన్న గాలిలో తేమ భూమి ఉపరితలంపై 15వేల అడుగుల ఎత్తు వరకూ వ్యాపించనుంది. రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలు మేఘావృతం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నమే మెరుపులతో కూడిన దుమ్ము తుఫాన్ రానుంది. రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలు మెరుపులతో కూడా తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.
ఇదే సమయంలో గుజరాత్ చుట్టూ ఉన్న కొన్ని జిల్లాలు మాత్రం పొడిగా ఉండనున్నట్లు కనిపిస్తుంది. గుజరాత్‌లో మే17వరకూ ఇదే వాతావరణం కొనసాగనుంది. ఆ తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించి కాస్త స్పష్టమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.