Threat vaccination staff with snake : ‘నాకు వ్యాక్సిన్ వేసారో..పాముతో కరిపిస్తా జాగ్రత్త’ : మహిళ బెదిరింపు

నాకు బలవంతంగా కరోనా వ్యాక్సిన్ వేయిాలని చూస్తే పాముతో కరిపిస్తా జాగ్రత్త అంటూ వైద్య సిబ్బందిని బెదరించిందో మహిళ..బుట్టలో ఉన్న పాముని బయటకు తీసి మరీ బెదిరించటంతో సిబ్బంది షాక్..

Woman threatens vaccination staff with snake : వ్యాక్సిన్ వేయించుకుంటేనే కరోనాను అడ్డుకోవచ్చనీ..దయచేసి అందరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు..అధికారులు నెత్తీ నోరు కొట్టుకుని చెబుతున్నా..ఇంకా చాలామంది వేయించుకోవట్లేదు. దీంతో వైద్య అధికారులు అటువంటివారికి నచ్చచెప్పి వ్యాక్సిన్ వేయించేయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్లు వినటంలేదు సరికదా..బెదరిస్తున్నారు. భయపెడుతున్నారు. ఈక్రమంలో ఓ మహిళ తనకు కరోనా వ్యాక్సిన్ వేయటానికి వచ్చిన అధికారుల్ని బెదరిస్తు..‘నాకు వ్యాక్సిన్ వేయాలని నా దగ్గరకొస్తే పాముతో కాటు వేయిస్తా జాగ్రత్త’’అంటూ బుట్టలో ఉన్న పాముని బయటకు తీసి మరీ బెదిరంపులకు దిగింది. దీంతో సదరు అధికారులు షాక్ అయ్యారు. బిత్తరపోయారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయటానికి వైద్య సిబ్బంది వచ్చారు. ఇంటింటికి వచ్చి టీకాలు వేస్తున్నారు. అలా డోర్ టూ డోర్ వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది ఓ మహిళ ఇంటికి వచ్చి టీకా వేయించుకోమ్మా అంటూ కోరారు. కానీ ఆమె నేను వ్యాక్సిన్ వేయిచుకోను మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ చెప్పింది.దానికి సిబ్బంది ‘అదికాదమ్మా వ్యాక్సిన్ వేయించుకోవాలి..’అంటూ నచ్చచెప్పబోయారు.

Read more : Covid vaccine : నా శివయ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాడు..రోడ్డుపై మహిళ వీరంగం

కానీ ఆమె ససేమిరా అంది. పైగా మీరు నాకు బలవంతంగా వ్యాక్సిన్ వేయాలని చూస్తే పాముతో కరిపిస్తానంటూ..బుట్టలో ఉన్న పామును బయటికి తీసింది. దాంతో ఆరోగ్య సిబ్బంది మొదట భయపడిపోయారు. తర్వాత ఆమెకున పలు రకాలుగా నచ్చచెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోకపోతే కరోనా వస్తుందనీ..అది మొత్తం గ్రామం అంతా వ్యాప్తి చెందుతుందని..అది చాలా ప్రమాదమంటూ పలు రకాలుగా నచ్చ చెప్పారు. అలా దాదాపు రెండు మూడు గంటలపాటు పలు రకాలుగా నచ్చ చెప్పి ఆమె మనస్సు మార్చగలిగారు. అలా ఎట్టకేలకు ఆమె వ్యాక్సిన్ వేయించుకోవటానికి అంగీరించింది. దీంతో ఊపిరి పీల్చుకున్న వైద్య సిబ్బంది ఆమెతో పాటు గ్రామంలో అందరికీ వ్యాక్సిన్లు వేయటం పూర్తి చేయగలిగారు.

Read more : Villagers Attack On Vaccine Team : వ్యాక్సిన్ వేయటానికి వచ్చిన సిబ్బందిపై కర్రలతో గ్రామస్తులు దాడి

కాగా..కరోనా వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. వ్యాక్సిన్ వచ్చి కూడా 10నెలలు కావస్తోంది. కానీ ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవటానికి చాలామంది జనాలు వెనకాడుతున్నారు. కొంతమంది మూఢనమ్మకాలతో వేయించుకోవట్లేదు. మరికొంతమంది లేనిపోని అనుమానాలతో వేయించుకోవట్లేదు. ఈ క్రమంలో ఎంతోమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెనుకాడుతున్నారు. భయపడుతున్నారు. లేని పోని అపోహలతో టీకాలు వేయించుకోవట్లేదు. దీంతో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయటం అంటే పెద్ద టాస్క్ గా మారింది.

Read more : Corona Vaccination Fear : వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటూ…నదిలో దూకి పారిపోయిన గ్రామస్తులు

గతంలో ఓ మహిళ నేను శివ భక్తురాలిని..వ్యాక్సిన్ వేయించుకోవద్దని నాకు శివయ్య చెప్పాడు అంటూ నానా యాగీ చేసిన విషయం తెలిసిందే. మరోచోట వ్యాక్సిన్ వేయటానికి వైద్య సిబ్బంది వస్తే వారిని కర్రలతో కొట్టి తరిమేసారు. మరోచోట వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడి నదిలోకి దూకేసారు. ఇలా పలు ప్రాంతాల్లో పలు రకాల ఘటనలు జరుగుతుండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు