మాజీ ప్రధాని హత్య కేసు ..దోషికి పెరోల్

  • Published By: venkaiahnaidu ,Published On : November 24, 2020 / 03:34 AM IST
మాజీ ప్రధాని  హత్య కేసు ..దోషికి పెరోల్

Updated On : November 24, 2020 / 7:16 AM IST

SC extends parole of A G Perarivalan by a week మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివళన్ కి మరో వారం‌ పెరోల్ జారీ చేసింది సుప్రీంకోర్టు. వైద్య పరీక్షల నిమిత్తం సుప్రీం కోర్టు సోమావారం ఆయనకి వారం రోజులపాటు పెరోల్‌ జారీ చేసింది.



తాజాగా ఇచ్చిన పెరోల్‌ గడువు జనవరి 19 వరకు కొనసాగుతుంది. కాగా, నవంబర్12న అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూడటానికి, మేనకోడలు వివాహం హాజరుకావడానికి పెరోల్‌ పోందారు. ప్రస్తుతం పెరరివళన్‌ జీవిత ఖైదు శిక్షను చెన్నై సమీపంలోని పుజల్ సెంట్రల్ జైలులో అనుభవిస్తున్నారు.



1991లో చెన్నై సమీపంలోని శ్రీపెరంపుదూర్ వద్ద జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎల్‌టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మృతి చెందిన విషయం తెలిసిందే. పెరరివళన్‌తో పాటు, ఈ కేసులో దోషులుగా తేలిన మురుగన్‌, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు జీవిత ఖైదు విధించారు.

ఈ ఏడుగురిని విడుదల చేయాలనే తీర్మానాన్ని తమిళనాడు మంత్రివర్గం ఆమోదించగా, ఆ కేసుకు సంబంధించిన ఫైల్‌ గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న ఉన్న విషయం తెలిసిందే.