ఇలా అయితే ఎలా : రాజ్యసభలో రగడ…

ఢిల్లీ : రాజ్యసభలో సేమ్ సీన్…విపక్ష సభ్యులు ఆందోళన చేయడం…సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ ఛైర్మన్ సూచించడం…వాటిని విపక్ష సభ్యులు బేఖాతర్ చేయడం పరిపాటై పోయింది. విపక్ష సభ్యులు రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి రగడ కొనసాగుతూనే ఉంది.
2019, జనవరి 2వ తేదీన రాజ్యసభ ప్రారంభమైంది. రాజ్యసభలో అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. కావేరీ అంశంపై చర్చించాలంటూ వారు డిమాండ్ చేశారు. సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి దేశ ప్రజలు చూసి నవ్వుతున్నారని…వెంకయ్య తెలిపారు. నితిన్ గడ్కరీ వచ్చిన తరువాత సభలో ప్రకటన చేస్తారని..సభ్యులు ఆందోళన విరమించాలని విజయ్ గోయల్ సూచించారు. అయినా సభ్యులు వినిపించుకోలేదు. సభ్యుల ఆందోళణ విరమించే సూచనలు కనిపించకపోవడంతో సభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించేసి వెళ్లిపోయారు.