ఖైదీలను తీసుకెళ్లే వ్యాన్స్‌ను … కోవిడ్ మొబైల్ ల్యాబ్స్‌గా మార్చేశారు….

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 12:09 PM IST
ఖైదీలను తీసుకెళ్లే వ్యాన్స్‌ను … కోవిడ్ మొబైల్ ల్యాబ్స్‌గా మార్చేశారు….

Updated On : April 20, 2020 / 12:09 PM IST

దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజు రోజుకు కోవిడ్ 19 కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని 79 కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారికి వేగంగా కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించటం కోసం పోలీసులు ఖైదీలను తీసుకువెళ్లాటానికి ఉపయోగించే 25 వ్యాన్లను మెుబైల్ ల్యాబ్స్ గా తయారు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 20, 2020) ఒక ప్రకటనలో తెలిపింది.
 
రాజధానిలో కంటైన్ మెంట్ జోన్ లలో రాబోయే 3-4 రోజులలో 40వేల పరీక్షలను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఢిల్లీలోని 11 జిల్లాలో ప్రతి జిల్లాకు రెండు వ్యాన్లలను కేటాయించారు. మిగతా మూడు మాత్రం ప్రధాన కార్యాలయంలోని స్టాండ్ బైలో ఉంచబడతాయి అని అధికారులు తెలిపారు.
 
శనివారం నిర్వహించిన పరీక్షలో 186 మందికి కోవిడ్ 19 లక్షణాలు లేకున్నా వ్యాధి సోకిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక రోజు తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ మెుబైల్ వ్యాన్లను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యాధి ‘silent spreaders’ అని తెలియకుండానే ఇతరులకు సోకుతుందనే అనుమానాలకు బలం చేకూర్చింది. అలాంటి వ్యక్తులను కనుగోనటానికి పరీక్షలను వేగవంతం చేయటం అవసరమని నొక్కి చెప్పారు.

ప్రస్తుతం లాక్ డౌన్ సంబంధించిన ఏవిధమైన సడలింపులు చేయటంలేదని, ఎందుకంటే రాష్ట్రంలో కేసులు ఎక్కువగా ఉండటంతో ‘రెడ్ జోన్ ప్రాంతంగా’ఉంది. మెుత్తం రాష్ట్రంలో  ఉన్న 11 రెవెన్యూ జిల్లాలను వైరస్ హాట్ స్పాట్ లుగా నియమించింది. ఈ పరిస్ధితి పై ఏప్రిల్ 27, 2020 న ప్రభుత్వం సమీక్షించనుంది.  ఇప్పటికే పరీక్షలను వేగవంతం చేయటం కోసం నగర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఉన్నతాధికారి తెలిపారు. దీనికి సంబంధించిన పరీక్ష కిట్లు అందుబాటులో ఉండటం వల్లే సాధ్యమౌవుతుంది తెలిపారు. 

ఆదివారం(ఏప్రిల్ 19, 2020) న నిర్వహించిన పాజిటివ్ కేసుల్లో తిలక్ నగర్ నుంచి 35 మంది, తుగ్లకాబాద్ ఎక్స్ టైన్షన్ నుంచి 30, నబీ కరం నుంచి5, సదర్ బజార్ నుంచి 3, నిజాముద్దీన్ నుంచి 2 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ వ్యాన్లను పోలీస్ ప్రోటెక్షన్ తో కంటైన్ మెంట్ జోన్లలకు పంపుతారు.

ఒకవేళ పరిస్ధితులు అదుపు తప్పితే పారామిలటరీ బలగాలను తీసుకువచ్చే అవకాశం లేదని తెలిపింది. ఎందుకంటే చాందిని మహల్ పోలీస్ స్టేషన్ చీఫ్ కి ,మరికొంతమంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి విధులను నిర్వర్తించటానికి పోలీసులు భయపడుతారు. కోవిడ్ 19 హాట్ స్పాట్ లో ప్రజలను పరీక్షించటంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను కోరడంతో పాటు వారికి కోటి రూపాయాలను నష్ట పరిహారం (ఎక్స్ గ్రేషియా) ప్రకటించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.