Rat Bite Patient Eye : ముంబై ఆస్పత్రిలో పేషెంట్ కన్ను కొరికిన ఎలుక..

ముంబై ఆస్పత్రిలో కంటి సర్జరీ కోసం వెళ్లిన పేషెంట్ కన్ను కొరికేసింది ఓ ఎలుక.. అతడి కంటిపై దగ్గరలో ఎలుక కొరకడంతో గాయాలు అయ్యాయని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Rat Bite Patient Eye : ముంబై ఆస్పత్రిలో పేషెంట్ కన్ను కొరికిన ఎలుక..

Rat Bites Patient Rat Bites Patient At Mumbai Civic Hospital

Updated On : June 22, 2021 / 9:32 PM IST

Rat Bite Patient Eye : ముంబై ఆస్పత్రిలో కంటి సర్జరీ కోసం వెళ్లిన పేషెంట్ కన్ను కొరికేసింది ఓ ఎలుక.. అతడి కంటిపై దగ్గరలో ఎలుక కొరకడంతో గాయాలు అయ్యాయని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో కన్ను ఆపరేషన్ కోసం చేయించుకునేందుకు వెళ్లినట్టు బాధితుడు వాపోయాడు.

ఎలుక కొరికిన కొద్దిపాటి గాయాలు మాత్రమే అయ్యాయని, కంటికి ఎలాంటి హాని లేదని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సిందని, పేషెంట్ కు స్వల్పంగా గాయాలు అయ్యాయని ఆస్పత్రి డీన్ విద్యా థాకూర్ తెలిపారు. బాధితుడికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

ఆస్పత్రిలోని గ్రౌండ్ ప్లోర్ లోని వార్డులో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి ప్రాంగణంలో కొంతమంది చెత్తను పారేయడం ద్వారా ఎలుకలు సంచరిస్తున్నాయని అంటున్నారు. ఆస్పత్రి లోపల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపడతామని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.