Ratan TATA : ఎయిర్‌ఇండియా ప్రయాణికులకు రతన్‌టాటా ఆడియో మెసేజ్‌

ఎయిరిండియా ప్రయాణికులకు స్వాగతమంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్ పంపారు. ఎయిర్‌ఇండియా విమానాల్లో దాన్ని వినిపించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చేప్రయత్నం చేశారు.

Ratan TATA : ఎయిర్‌ఇండియా ప్రయాణికులకు రతన్‌టాటా ఆడియో మెసేజ్‌

Ratan Tata

Updated On : February 2, 2022 / 6:54 PM IST

Ratan TATA Audio Message : ఎయిర్‌ఇండియాను స్వాధీనం చేసుకున్న టాటాగ్రూప్‌ దాన్ని సరైన ట్రాక్‌లో పెట్టే పనిలో పడింది. ప్రయాణికులను ఆకట్టుకునే పనిలో పడింది. టాటా గ్రూప్‌కు ఎయిరిండియా బదిలీ అయిన తర్వాత టాటాసన్స్ గౌరవ ఛైర్మన్‌ రతన్‌టాటా తొలిసారిగా స్పందించారు. ప్రయాణికులకు సందేశాన్ని ఇచ్చారు.

ఎయిరిండియా ప్రయాణికులకు స్వాగతమంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్ పంపారు. ఎయిర్‌ఇండియా విమానాల్లో దాన్ని వినిపించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రతన్‌టాటా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌ఇండియాను కేంద్రం వదిలించుకుంది.

Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..

గతవారమే ఎయిర్‌ఇండియా టాటా గ్రూప్‌ చేతికి వచ్చింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా కార్యకలాపాలు టాటా గ్రూప్‌ నియంత్రణలోనే సాగుతున్నాయి. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో సంస్థను తమ విలువలకు తగినట్లుగా నడిపించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది.