Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..

ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీలో సేవలందించే ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కొవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గింది. పది రోజుల గ్యాప్ లో రికవరీ అయిన వాళ్లకే మరోసారి ఇన్ఫెక్షన్ సోకింది.

Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..

Omicron Live

Omicron: ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీలో సేవలందించే ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కొవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గింది. పది రోజుల గ్యాప్ లో రికవరీ అయిన వాళ్లకే మరోసారి ఇన్ఫెక్షన్ సోకింది. దీనిని బట్టి చూస్తే.. ఒమిక్రాన్ ఒకసారి తగ్గిన తర్వాత మళ్లీ ఎంత కాలానికి తిరిగొస్తుంది.. అసలు రీ ఇన్ఫెక్షన్ అవుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

‘పద్నాలుగు రోజుల క్రితం ఇద్దరు డాక్టర్లకు లక్షణాలతో కొవిడ్ వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకున్నాక కొద్ది రోజులకు నెగెటివ్ అని వచ్చింది. రికవరీ అయిన ఏడెనిమిది రోజుల తర్వాత మళ్లీ అవే లక్షణాలు కనిపించడం మొదలుపెట్టాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతులో మంట వంటివి కనిపించాయి. మరోసారి వారి జెనోమ్ సీక్వెన్సింగ్ శాంపుల్స్ ను పరీక్షలకు పంపించాం’ అని కార్డియాక్ అనిస్తియాస్టిస్ట్ డా. జీతుమోని బైష్యా చెబుతున్నారు.

ఒమిక్రాన్ రెండు సార్లు ఇన్ఫెక్ట్ అయిందా.. రెండు రకాల వేరియంట్లు ఒకటి తర్వాత ఒకటి అటాక్ చేశాయా అనే దానిపై స్పష్టత రాలేదు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

Read Also : సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్టీసీ ఉద్యోగులు

‘శరీరంలో ఇన్ఫెక్షన్ తక్కువగా డెవలప్ అయినా.. మధ్యస్థాయిలో ఉన్నా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ మళ్లీ సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. పేషెంట్ లో ఉన్న ఇమ్యూనిటీని బట్టి ఇతర వేరియంట్లను తట్టుకునే స్థామర్థ్యం ఉందా అని తెలుస్తుంది. ఒకవేళ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే రీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ’ అని మ్యాక్స్ హాస్పిటల్ కు చెందిన డా. బైష్యా అంటున్నారు.

సర్ గంగా రామ్ హాస్పిటల్.. డా. ధీరేన్ గుప్తా మాట్లాడుతూ.. ‘కొవిడ్ లక్షణాలు కనిపించి తగ్గిపోయిన కొద్దిమంది పేషెంట్లలో ఓ నాలుగు వారాల తర్వాత మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ. రికవరీ అయ్యాక కూడా మళ్లీ ఇన్ఫెక్ట్ అవుతున్న వాళ్ల గురించి తెలుసుకోవాల్సి ఉంది’ అన్నారు.