APSRTC Employees : సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్టీసీ ఉద్యోగులు

ఉద్యోగుల డిమాండ్లలో తమకు సంబంధించినవి లేవన్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.

APSRTC Employees : సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్టీసీ ఉద్యోగులు

Rtc Employees

APSRTC Employees : ఛలో విజయవాడతో సమ్మెకు ఎక్కడికక్కడ ప్లాన్ చేస్తున్న ఏపీ పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆర్టీసీ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. ఉద్యోగుల సమ్మెలో పాల్గొనేది లేదని ఆర్టీసీ ఉద్యోగులు తేల్చి చెప్పారు. సమ్మెలో పాల్గొనడం లేదంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆర్టీసీ సంక్షేమ సంఘాల నేతలు లేఖ అందించారు. ఉద్యోగుల డిమాండ్లలో తమకు సంబంధించినవి లేవన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగే కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.

సమ్మెకు వెళ్లేదిలేదంటూ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘాలు నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో పాల్గొనబోమని చెప్పారు. ఉద్యోగులతోపాటు సమ్మెకు వెళ్లేంది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 వేల మందికిపైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులం సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత శాస్త్రి చెప్పారు.

Sajjala Ramakrishnareddy : ఉద్యోగ సంఘాల తీరుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల సీరియస్

తమకు ప్రభుత్వ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమ్మెకు తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఏపీ ఉద్యో్గులు ఇచ్చిన 71 పాయింట్లలో ఆర్టీసీకి సంబంధించి ఒక్క పాయింట్ కూడా చేర్చ లేదన్నారు. వారు చేస్తున్న సమ్మెకు తాము ఎందుకు బస్సులు ఆపాలన్నారు. తమ సంస్థను ఎందుకు నష్ట పరుచుకోవాలన్నారు.

చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. బస్సులు ఆపి నష్ట పోయే పరిస్థితి తాము ఇప్పుడు చేయదల్చుకోలేదని చెప్పారు. ఉద్యోగుల సమ్మెకు తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తాము ప్రభుత్వానికి సుముఖంగా ఉన్నామని, తమతో కలిసి వచ్చే బీసీ, ముస్లీ మైనారిటీ సంఘం కలిపి మొత్తం 45 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా, బస్సులు తిప్పేటందుకు రెడీగా ఉన్నారని తెలిపారు.