Sajjala Ramakrishnareddy : ఉద్యోగ సంఘాల తీరుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల సీరియస్

ఉద్యోగ సంఘాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మెకు దిగి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయని ప్రశ్నించారు.

Sajjala Ramakrishnareddy : ఉద్యోగ సంఘాల తీరుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల సీరియస్

Sajjala (1)

Sajjala Ramakrishnareddy  : ఉద్యోగ సంఘాల తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులను సైతం సమ్మెలోకి లాగి ప్రజా జీవితాన్ని స్తంభింపచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటే చూస్తూ ఉరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉద్యోగ సంఘాలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మెకు దిగి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయని ప్రశ్నించారు.

సమ్మె అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కరిద్దామని చెప్పామని.. ఆ విధంగా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలని సజ్జల సూచించారు. ఉద్యోగులకు జీతాలు ఇప్పటికే పడ్డాయని తెలిపారు. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయని చెప్పారు. సమస్యలుంటే పాయింట్ల వారిగా చెప్పాలని కోరారు. సమ్మె అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కరిద్దామని చెప్పామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెలోకి ఆహ్వానించి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 

APSRTC Employees : సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్టీసీ ఉద్యోగులు

ఉద్యోగులు ఇచ్చిన మూడు డిమాండ్స్ లో రెండు అయిపోయాయి.. వెనక్కి వెళ్లడం కుదరదన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే తీర్చడానికి అవకాశం లేని డిమాండ్స్ అడుగుతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కూడా శశిభూషన్ కుమార్ తో మాట్లాడారని.. చర్చలకు పిలిచారని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది.. వారు వస్తే చర్చలు జరుపుతామని చెప్పారు. ఉద్యోగుల కార్యాచరణ వాయిదా వేసుకుని చర్చలకు రావాలని కోరామని పేర్కొన్నారు.

బలప్రదర్శన ఎవరిపై ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నారు..ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల చొరబాటుకు అవకాశం ఉంటుందన్నారు. ఒక పక్క కోవిడ్ నిబంధనలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. అరెస్టు చేస్తారని తెలిసి ఎందుకు అలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ విషయంలో ఏ ప్రభుత్వం చెయ్యని మంచి పని సీఎం జగన్ చేశారని తెలిపారు. జనజీవనాన్ని స్తంభింప చేస్తే.. ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మీ బలం పెంచుకోడానికి అందరిని కలుపుతున్నారా.. ప్రజలకు ఇబ్బంది కలిగే రంగాలను ముందుకు పెడుతున్నారా అని అడిగారు.

East Godavari : కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి

ఇలాంటి వత్తిడి తెచ్చే పద్ధతి ద్వారా ఏమి సాధించాలి అనుకుంటున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఉన్న పరిస్థితిని బట్టి HRA విషయంలో నిర్ణయం తీసుకున్నారు.. ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో వస్తే వివరిస్తారని పేర్కొన్నారు. రికవరీ అనేది లేదు.. ఐఆర్ adjustment ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తోనే ఉద్యోగులు సెటిల్ చేసుకోవాలి.. కోర్టు కూడా అదే చెప్పిందని గుర్తు చేశారు. వత్తిడి తీసుకువచ్చే విధానంలోకి ఉద్యోగులు ఎవరు భాగస్వామ్యం కావద్దని కోరారు.

బలప్రదర్శనలో ఎవరూ పాల్గొన్నవాల్సిన అవసరం లేదు.. ఇలాంటివి దూరం పెంచుతాయని పేర్కొన్నారు. పరిస్థితి జఠిలం చేయొద్దు.. పరిష్కరానికి బదులు నష్టం చేసుకోవద్దన్నారు. ఎప్పటికైనా తమతో చర్చలకు రావాలి.. పరిష్కరించుకోవాలన్నారు. జీతాలు వేయొద్దు అని ఎందుకు అంటున్నారు.. జీతాలు పెరిగినట్టు తెలియాలి కదా అన్నారు. టెక్నీకల్ గా వెలగపూడిలోనే రాజధాని ఉనట్టు అని తెలిపారు. తమ నిర్ణయం ప్రకారం మార్పు జరుగుతుంది.. అప్పటి వరకు వెలగపూడిలోనే ఉంటుందన్నారు. విభజన హామీలకు దిక్కు లేదు.. కొత్తగా ఇస్తారని అనుకోలేదని వెల్లడించారు.