East Godavari : కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి

జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈరోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు జీలుగు కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే వారికి వికారంగా ఉండి, కడుపులో నొప్పి మొదలైంది.

East Godavari : కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి

Gilugu

Five killed in drunken False jeelugu stones : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. ముందు ఇద్దరు మృతి చెందగా.. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కల్లు శాంపిల్స్‌ను సేకరించారు.

జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈరోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు జీలుగు కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే వారికి వికారంగా ఉండి, కడుపులో నొప్పి మొదలైంది. కడుపు నొప్పి అనంతరం వాంతులు, విరోచనాలు కావడంతో వారిని గడ్డంగికి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం అందించారు.

KCR : బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు

వైద్యం జరుగుతుండగా ఆ ముగ్గురు కూడా మృతి చెందారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం సీరియస్ అయింది. తాగిన కల్లు శాంపిల్స్ ను కూడా ల్యాబ్ కు పంపించారు. అయితే కల్తీ కల్లు తాగడం వల్లే ఈ ఘటన జరిగిందా అన్న అంశంపై దర్యాప్తు ప్రారంభించారు.

కానీ ఐదుగురి మరణంతో లోదొడ్డి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ ఐదు కుటుంబాలు కూడా అనాథలయ్యాయి. కేవలం కల్లు తాగడం వల్లే ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది.