KCR : బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో వివిధ పార్టీల నేతలతో కలిసి చర్చిస్తామన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడమన్నారు.

KCR : బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు

Kcr (3)

KCR : బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెండు రోజుల్లో మహారాష్ట్ర సీఎంను కలుస్తానని చెప్పారు. అటు బీజేపీ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలను శివసేన ధ్రువీకరించింది. 2024లో బీజేపీయేతర పక్షాలు కలిసి పోటీ చేస్తాయంటోంది. నెల రోజులుగా టీఆర్‌ఎస్‌తో ఇదే అంశంపై చర్చలు జరుగుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ప్రకటించారు. బీజేపీయేతర పక్షాలను కూడదీసే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో వివిధ పార్టీల నేతలతో కలిసి చర్చిస్తామన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడమన్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం పోరాడతామని సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో తమ బాధ్యత నిర్వర్తిస్తామని తెలిపారు. దేశంలో మార్పు తీసుకొస్తామని పేర్కొన్నారు.

Chintamani drama AP HC : చింతామ‌ణి పుస్త‌కాన్ని నిషేధించ‌లేదు..నాట‌కాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?: ఏపీ హైకోర్టు

దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించారు. బీజేపీ విధానాల్ల దేశ రైతాంగమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఈ విషయాలు వెల్లడయ్యాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశం మరింత వెనక్కి పోతుందని, ఇది దుర్మర్గామైన పాలన కాబట్టి కచ్చితంగా దేశ వ్యాప్తంగా ఒక ప్రత్యేక వ్యవస్థ రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మాట్లాడిన సందర్భంలో కరోనా టైంలోనూ కేంద్ర ప్రభుత్వం దరిద్రపుగొట్టు నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఏ వర్గానికీ కేటాయింపులు పెంచలేదన్నారు. మరి ఎవరికి పెంచినట్లు ప్రశ్నించారు. బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, మత పిచ్చి లేపుడు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఎయిరిండియాను అమ్మారు…ఇప్పుడు ఎస్ఐసీ వంతు వచ్చిందన్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని మోదీని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు.

Coal Mine : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. అక్రమ గనిలో ఐదుగురు మృతి..!

కానీ రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ ఉత్తి బోగస్ అని విమర్శించారు. దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశ వాతావరణాన్ని చెడగొడుతుందన్నారు. మీరు మొరిగితే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటామని తెలిపారు. రాష్ట్రాన్ని చెడగొడతా మంటే ఊరుకోవాలా అని అన్నారు. సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారాలను చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దళిత బంధు పథకం మీకు కనపడటం లేదా అని నిలదీశారు.