Chintamani drama AP HC : చింతామ‌ణి పుస్త‌కాన్ని నిషేధించ‌లేదు..నాట‌కాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?: ఏపీ హైకోర్టు

చింతామ‌ణి పుస్త‌కాన్ని నిషేధించ‌లేదు..నాట‌కాన్ని ఎలా బ్యాన్ చేస్తారు? నాటకంలో క్యారెక్టర్ బోగోకపోతే మొత్తం నాటకాన్ని బ్యాన్ చేస్తారా? అంటూ ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది

Chintamani drama AP HC : చింతామ‌ణి పుస్త‌కాన్ని నిషేధించ‌లేదు..నాట‌కాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?: ఏపీ హైకోర్టు

Chintamani Drama Heard In Ap High Court

Chintamani drama heard in AP High Court : ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధించింది వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి జీవోను కూడా జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోను సవాల్‌ చేస్తూ వైసీపీలో రెబల్ గా మారిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. చింతామణి నాటకాన్ని నిషేధిస్తు ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆయన పిటీషణ్ లో కోరారు. ఈ వ్యాజ్యంపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలుచేసింది.

Also read : Chintamani : చింతామణి నాటకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం, ప్రదర్శిస్తే కఠిన చర్యలు

చింతానాట‌కంలో ఒక క్యారెక్ట‌ర్ బాగోలేనంత మాత్రాన మొత్తం నాట‌కాన్ని ఎలా నిషేధిస్తార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది. చింతామ‌ణి పుస్త‌కాన్ని నిషేధించ‌న‌ప్పుడు నాట‌కాన్ని ఎలా బ్యాన్ చేస్తారు? అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాటకంలో క్యారెక్టర్ బోగోకపోతే ఆ పాత్రను బ్యాన్ చేయాలి గానీ మొత్తం నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు? అని ప్రశ్నించింది.

దీంతో ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది ధర్మాసనానికి స‌మాధానం ఇస్తూ… ప్ర‌భుత్వానికి వ‌చ్చిన రిప్రజెంటేష‌న్ ఆధారంగా బ్యాన్ విధించిన‌ట్లు హైకోర్టుకు తెలిపారు. దీంతో రిప్రజెంటేష‌న్‌ను త‌మ ముందు ఉంచాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంగ‌ళ‌వారంలోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పేర్కొంది.