Ratan TATA: నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన రతన్ టాటా

టాటా సన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా తాజ్ హోటల్ కు వచ్చారు. అది కూడా నానో కారులో ఏ బాడీ గార్డ్ సాయం లేకుండా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వచ్చిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

Ratan TATA: నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన రతన్ టాటా

Tata Nano

Updated On : May 18, 2022 / 4:56 PM IST

Ratan TATA: టాటా సన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా తాజ్ హోటల్ కు వచ్చారు. అది కూడా నానో కారులో ఏ బాడీ గార్డ్ సాయం లేకుండా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వచ్చిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

రాజుకు భద్రతలో కొదవేముంది. ఆయనకు హోటల్ స్టాఫ్ రక్షణ కవచలంలా నిలబడి లోపలికి తీసుకెళ్లారు. ఆయన సింప్లిసిటీని చూసి సోషల్ మీడియా అంతా పొగడ్తలతో ముంచెత్తుతూ పర్సనల్‌గా ఆయన చాలా సింపుల్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు.

ఈ బిజినెస్ దిగ్గజం హుందాతనం, సింప్లిసిటీ చాలా సపరేట్.

Read Also: టాటా నుంచి ఎలక్ట్రిక్ కార్గో వెహికల్.. ఫుల్ డిమాండ్

గత నెలలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నానో కార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మెసేజ్ ఇచ్చారు. “నన్ను నిజంగా ప్రేరేపించినది, అలాంటి వాహనాన్ని తయారు చేయాలనే కోరికను రేకెత్తించింది. నిరంతరం భారతీయ కుటుంబాలను స్కూటర్‌లపై చూడటం, బహుశా తల్లి, తండ్రి మధ్య పిల్లవాడు ఎక్కడికి వెళుతున్నారో అక్కడకు వెళ్లడం, తరచుగా జారే రోడ్లపై ప్రయాణించడం చూసే కాబోలు” అని అందులో పేర్కొన్నారు.