బ్యాంకు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI

బ్యాంకు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI

Updated On : December 9, 2020 / 11:30 AM IST

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం మహారాష్ట్రలోని కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేసింది. సరిపడ పెట్టుబడులు లేకపోవడంతో పాటు లాభాలు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఫలితంగా 99శాతం కంటే ఎక్కువ మంది డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి ఫుల్ పేమెంట్ వస్తుందని ఆర్బీఐ స్టేట్‌మెంట్లో వెల్లడించింది.

లైసెన్స్ క్యాన్సిలేషన్ తో పాటు, లిక్విడేషన్ ప్రొసీడింగ్స్, డిపాజిటర్లకు కరద్ జనతా సహకారి బ్యాంక్ మొదలుపెట్టేసింది. ఈ క్రమంలోనే డీఐసీజీసీ రూ.5లక్షల వరకూ ఉన్న డిపాజిట్లకు రీపేమెంట్ వస్తుందని హామీ ఇచ్చింది.



లైసెన్స్ క్యాన్సిలేషన్ తర్వాత డిసెంబర్ 7న బిజినెస్ క్లోజ్ చేశారు. దాంతో బ్యాంక్ ఇకపై పనిచేయదని కన్ఫామ్ అయింది. ఇందులోనే డిపాజిట్లు, డిపాజిట్ల రీపేమెంట్లు అవుతాయని తెలిపింది. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం.. 2017 నవంబర్ 7నుంచి ఆ బ్యాంకు పరిశీలనలో ఉందట.

మహారాష్ట్రలోని కోఆపరేషన్ అండ్ రిజిష్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్.. దీనిపై ఆర్డర్ ఇష్యూ చేయాలని నిర్దేశించింది. బ్యాంకింగ్ రెగ్యూలేషన్ యాక్ట్ 1949 ప్రకారం.. సరిపడ ఆస్తులు లేకపోవడం, తగు ఆదాయం లేకపోవడంతో లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నామని ఆర్బీఐ చెప్పింది.



ఒకవేళ పబ్లిక్ ఇంట్రస్ట్ ప్రకారం.. బ్యాంకు కొనసాగాలని అనుకుంటే భవిష్యత్ లో బ్యాంక్ ఓపెన్ చేసేందుకు అవకాశాలు ఉంటాయని ఆర్బీఐ చెప్పింది.