Real Chand Nawab.. ‘కరాచీ సే’ వైరల్ వీడియో.. వేలంలో ఎంత పలికిందో తెలుసా?

బాలీవుడ్ సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ మూవీ చూసే ఉంటారు. అందులో నవాజుద్దీన్ సిద్ధిఖి తనదైన నటనతో అందరిని నవ్వించాడు. ఆ మూవీలో కరాచీ రైల్వే స్టేషన్ సీన్ ఒకటి.

Real Chand Nawab.. ‘కరాచీ సే’ వైరల్ వీడియో.. వేలంలో ఎంత పలికిందో తెలుసా?

Real Chand Nawab Puts His Viral

Updated On : August 30, 2021 / 10:48 AM IST

Real Chand Nawab : బాలీవుడ్ బజరంగీ భాయిజాన్ మూవీ చూసే ఉంటారు. అందులో సల్మాన్ ఖాన్ నటనే కాదు.. నవాజుద్దీన్ సిద్ధిఖి తనదైన నటనతో అందరిని నవ్వించాడు. ఆ మూవీలో అత్యంత ఇష్టమైన సీన్ ఒకటి.. కరాచీ రైల్వే స్టేషన్ సీన్.. నవాజుద్దీన్ సిద్ధిఖీ పోషించిన ‘Chand Nawab’ రిపోర్టర్ పాత్ర.. ఈ సీన్‌లో అతడు రిపోర్టు చేస్తుండగా.. ప్రయాణికులు అంతరాయం కలిగిస్తుంటారు. వాస్తవానికి పాకిస్తానీ టీవీ జర్నలిస్ట్ చాంద్ నవాబ్‌కు ఎదురైన అనుభవం ఇది.. 2008లో రిపోర్టింగ్ చేసిన సమయంలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. బజరంగీ భాయిజాన్ మూవీతో రియల్ చాంద్ నవాబ్ ఫుల్ ఫేమస్ అయ్యాడు.. ఇప్పుడు అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు.

ఇప్పుడా రియల్ చాంద్ నవాబ్.. వైరల్ అయిన “కరాచీ సే” వీడియోను ఫౌండేషన్ యాప్‌లో Non-Fungible Token (NFT)గా విక్రయానికి పెట్టాడు. డిజిటల్ క్రియేటర్లు డబ్బులు సంపాదించుకునే ప్లాట్ ఫాం ఇది.. చాంద్ నవాబ్ కూడా తన వైరల్ వీడియోను ఈ యాప్ లో అప్ లోడ్ చేశాడు.. దీనిపై కనీస బిడ్ ధర సుమారు రూ. 46,74,700 వరకు (20 Ethereum టోకెన్లు, 63,604.20 డాలర్లు) ఉంటుంది. వేలంలో నవాబ్ ఇలా రాసుకొచ్చాడు.. ‘నేను చాంద్ నవాబ్.. ఒక జర్నలిస్ట్ , వృత్తి రీపోర్టర్. 2008 లో, రైల్వే స్టేషన్‌లో ఈద్ ఫెస్టివల్ సమయంలో రిపోర్టింగ్ చేస్తుండగా నేను తడబడిన వీడియో యూట్యూబ్‌లో అప్ లోడ్ అయింది. రిపోర్ట్ చేస్తుండగా అటుగా వచ్చే వ్యక్తుల వల్ల నాకు అంతరాయం కలిగింది.
Raja Anirudh Sriram : చిచ్చరపిడుగు.. ఆరేళ్లకే ‘మైక్రోసాఫ్ట్ ఆఫీసు’ స్పెషలిస్టు అయ్యాడు!

ఆ వీడియోలో నేను తడబడటం, చికాకు పడటం చూడొచ్చు. ఈ వీడియోను YouTube, Facebookలో అప్ లోడ్ చేయగా మిలియన్ల వ్యూస్ వచ్చాయి’ అని తెలిపాడు. 2016లో నా వైరల్ వీడియోను ఇండియన్ ఫిల్మ్ మేకర్ కబీర్ ఖాన్ తన 2015 బ్లాక్ బస్టర్ బజరంగీ భాయిజాన్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర కోసం వినియోగించుకున్నారు. దాంతో నా వైరల్ వీడియో మరింత పాపులర్ అయింది. భారత్, పాకిస్తాన్ నుంచి అనేకమంది నుంచి నాకు ప్రశంసలు అందాయి. ప్రత్యేకించి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, భజరంగీ భాయిజాన్ నటీనటుల నుంచి ప్రశసంలు వచ్చాయని పాకిస్తానీ జర్నలిస్ట్ తెలిపారు.