RedmiBook 15 : ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. లాంచ్‌కు ముందే లీక్

రెడ్ మీ బుక్ సిరీస్ భారత్ లో మరికొన్ని రోజుల్లో అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది. ఇంతలోనే రెడ్ మీ బుక్ 15 ధర, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

RedmiBook 15 : ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. లాంచ్‌కు ముందే లీక్

Redmibook 15

Updated On : July 31, 2021 / 10:38 PM IST

RedmiBook 15 : రెడ్ మీ బుక్ సిరీస్ భారత్ లో మరికొన్ని రోజుల్లో అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది. ఇంతలోనే రెడ్ మీ బుక్ 15 ధర, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ నుంచి కొత్త ల్యాప్ టాప్ రానుంది. 11వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు, 512జీబీ స్టోరేజీ. ఫుడ్ హెచ్ డీ డిస్ ప్లే. ఈ రెడ్ మీ బుక్ సిరీస్ లాంచ్ డేట్ ను గతవారంలో షావోమీ కన్ ఫర్మ్ చేసింది. రెడ్ మీ బుక్ సిరీస్ లో ఒక వెర్షన్ తీసుకొస్తారా లేక మల్టిపుల్ వెర్షన్స్ తెస్తారా అన్నది ఇంకా రివీల్ చెయ్యలేదు.

రెడ్ మీ బుక్ 15 ధర, స్పెసిఫికేన్లను 91 మొబైల్ లీక్ చేసింది. ఏసర్ స్విఫ్ట్ 3, అసుస్ వీవో బుక్, షావోమీ ఎంఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్ కు పోటీగా రెడ్ మీ ఎంఐ బుక్ 15 ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

రెడ్ మీ బుక్ ధర ఇండియాలో(అంచనా)
రెడ్ మీ బుక్ 15 దర ఇండియాలో రూ.50వేల లోపు ఉండొచ్చని అంచనా
అప్ కమింగ్ ల్యాప్ టాప్ ధరను షావోమీ ఇంకా ఇండికేట్ చేయలేదు
చార్ కోల్ గ్రే కలర్ లో ఉండొచ్చని తెలుస్తోంది.

రెడ్ మీ బుక్ 15 స్పెసిఫికేన్లు..(అంచనా)
రెడ్ మీ బుక్ 15 ధరతో పాటు స్పెసిఫికేషన్లను 91మొబైల్స్ లీక్ చేసింది.
15.6 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
11th Gen Intel Core i3
Core i5 ప్రాసెసర్
8జీబీ RAM
256జీబీ, 512 జీబీ PCIe SSD స్టోరేజ్
విండోస్ 10
డ్యూయల్ బాండ్ వైఫై
బ్లూటూత్ వి5.0
USB 3.1 Type-C
USB Type-A
USB 2.0, HDMI
ఆడియో జాక్
65W చార్జర్
బ్యాటరీ పూర్తి సామర్థ్యం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆగస్టు 3న అధికారక లాంచ్