మరోసారి తగ్గిన బంగారం ధర

reduced gold price : పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.661 తగ్గి 46,847 కి చేరింది. వెండి సైతం కిలోకి రూ.347 తగ్గింది. ఢిల్లీలో దీని ధర రూ.67,894కి చేరింది.
అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడం, రూపాయి విలువ స్వల్పంగా కోలుకోవడం దేశంలో బంగారం ధరల తగ్గుదలకు కారణమని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1815 డాలర్లు, కాగా వెండి 26,96 డాలర్లు ఉంది.