భారత పైలట్‌ను వెంటనే విడుదల చేయండి : పవన్ కళ్యాణ్

కడప: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. యుద్ధ ఖైదీలను

  • Published By: veegamteam ,Published On : February 28, 2019 / 11:07 AM IST
భారత పైలట్‌ను వెంటనే విడుదల చేయండి : పవన్ కళ్యాణ్

Updated On : February 28, 2019 / 11:07 AM IST

కడప: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. యుద్ధ ఖైదీలను

కడప: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. యుద్ధ ఖైదీలను హింసించరాదని, బందీగా చిక్కిన సైనికులను సురక్షితంగా వారి దేశాలకు అప్పగించాలని జెనీవా ఒప్పందం చెబుతోందని పవన్ గుర్తు చేశారు. పాకిస్తాన్.. జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని, అభినందన్‌ను భారత్‌కు అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు.
Read Also : అభినందన్‌ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?

ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందని పవన్ అన్నారు. యుద్ధం జరిగితే ఇరువైపులా నష్టం వాటిల్లుతుందన్నారు. యుద్ధం ఎవరూ కోరుకోరని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ చెరలో  బందీగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని జనసేన మనస్ఫూర్తిగా కోరుకుంటోందని పవన్ చెప్పారు. . యుద్ధం అంటూ జరిగితే.. భారత ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు.
Read Also : Booking Start : జియోఫోన్2 ఫ్లాష్ సేల్ సందడి

ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొరబడి దాడికి యత్నించాయి. వెంటనే అప్రమత్తమైన భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు పాక్ విమానాలను తరిమికొట్టాయి. పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానాన్ని కూల్చేశాయి. పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన మిగ్ 21 బైసన్ జెట్ పాకిస్తాన్ భూభాగంలో కుప్పకూలింది. అందులో ఉన్న వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ వెంటనే అభినందన్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఆయనపై అక్కడ దాడి జరిగింది. అభినందన్‌ను తీవ్రంగా కొట్టి హింసించారు.
Read Also : నష్టపరిహారం కోసం : అమరజవాను భార్యకు అత్తింటి వేధింపులు