వారికి మాత్రమే: ఒకటే రీఛార్జ్.. ఏడాదంతా ఫ్రీ

వారికి మాత్రమే: ఒకటే రీఛార్జ్.. ఏడాదంతా ఫ్రీ

Updated On : December 24, 2019 / 2:23 AM IST

దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ‘2020 హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌’లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అపరిమిత సేవలను రూ.2020కే అందించనుంది. మంగళవారం నుంచి ఆరంభంకానున్న ఈ ఆఫర్‌.. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. దీంతో పాటు 2020తో జియో ఫోన్ కొనుగోలు చేయదలచిన వారికి 12 నెలల పాటు సర్వీసు కూడా ఉచితం. ఈ జియో ఫోన్‌లో రోజుకు 0.5 జీబీ డేటాను అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలను అందివ్వనుంది. 

డిసెంబరు 24 నుంచి ఈ ప్లాన్‌ కస‍్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ సంవత్సర కాలం అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో పాటు జియో ఫోన్‌ వినియోగదారులూ పొందొచ్చు. ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు రోజుకు 1.5 జీబీ డేటా, జియో నెట్‌వర్క్‌పై అపరిమిత కాల్స్‌, ఇతర నెట్‌వర్క్‌లకు 12,000 నిమిషాలు, ఉచితంగా జియో యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తాయి. జియో ఫోన్‌ వినియోగదారులు కొత్త జియో ఫోన్‌, 12 నెలల అపరిమిత సేవలు, రోజుకు 0.5 జీబీ డేటా పొందొచ్చు.

వీటితో పాటు రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా రూ.98, రూ.149ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకురానుంది. ఈ రూ.98 ప్లాన్‌తో 28 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటాతో పాటు 300ఎస్ఎమ్ఎస్ లను కూడా అందిస్తుంది. జియో టు జియో ఫ్రీ కాల్స్. మాత్రమే ఇస్తుంది. కానీ, ఐయూసీ నిమిషాలను మాత్రం ఇవ్వడం లేదు. రూ.149ప్రీ పెయిడ్ యూజర్లకు రోజుకు 1జీబీ డేటా ఇవ్వడంతో పాటు జియో టు నాన్ జియో యూజర్లకు 300నిమిషాలు, రోజుకు 100ఎస్ఎమ్ఎస్  లు ఇస్తుంది. జియో టు జియో ఫ్రీ. దీని వ్యాలిడిటీ కేవలం 24రోజులు మాత్రమే. 

ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆల్ ఇన్ వన్ ప్యాక్ రూ.555ప్యాక్.. 84రోజుల పాటు సేవలు అందిస్తుండగా రోజుకు 2జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ రూ.2020తో రీచార్జ్ చేసుకుంటే 12నెలల పాటు రోజుకు 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. అంటే డేటా వినియోగం తక్కువ చేసే వాళ్లకు మాత్రమే.