Mumbai Building Collapses: భవనం కూలి మరో నివాసంపై పడటంతో 11మంది మృతి

ముంబైలోని ఓ రెండతస్థుల బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న నివాసంపై పడటంతో 9మంది మృతి చెందడంతో పాటు 8మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుప్పకూలిన భవనపు శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Mumbai Building Collapses: భవనం కూలి మరో నివాసంపై పడటంతో 11మంది మృతి

Building Collapses (1)

Updated On : June 10, 2021 / 7:28 AM IST

Mumbai Building Collapses: ముంబైలోని ఓ రెండతస్థుల బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న నివాసంపై పడటంతో 11మంది మృతి చెందడంతో పాటు 8మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుప్పకూలిన భవనపు శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న మూడంతస్థుల బిల్డింగ్ లో ఉండేవారిని ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది బీఎంసీ.

స్థానికులు ఇందులో ఇన్వాల్వ్ అయి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని వారిని సబ్ అర్బన్ కాండివలీ ప్రాంతానికి తరలిస్తున్నారు. ’17మంది గాయాలకు గురి కాగా 11మంది చనిపోయారు. 6మందికి చికిత్స అందిస్తున్నాం’ అని ఓ డాక్టర్ అన్నారు.

బీఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ చెప్పిన దాని ప్రకారం.. ఈ ఘటన బుధవారం రాత్రి 11గంటల 10నిమిషాలకు జరిగింది. సహాయక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.