ఆర్జీకర్ ఆసుపత్రి మహిళా డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషికి జీవితఖైదు
సీసీటీవీలో రికార్డుల ఆధారంగా సంజయ్ రాయ్‌ను గత ఏడాది ఆగస్టు 10న పోలీసులు అరెస్ట్ చేశారు.

కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి మహిళా డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషికి సీల్దా కోర్టు జీవితఖైదు విధించింది. విచారణ అనంతరం సంజయ్ రాయ్‌ని రెండు రోజుల క్రితమే కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.
దీంతో ఇవాళ కోర్టు దోషికి శిక్షను ఖరారు చేసింది. 2024 ఆగస్టు 9న రాత్రి సమయంలో ఆసుపత్రి సెమినార్ గదిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు పెల్లుబికాయి.
వైద్యుల ఆందోళనలు తారస్థాయికి చేరడంతో వారితో అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చర్చలు జరపాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో హత్యాచారం కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది.
సీసీటీవీలో రికార్డుల ఆధారంగా సంజయ్ రాయ్‌ను గత ఏడాది ఆగస్టు 10న పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ 120 మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. ఈ కేసులో భాగంగా ఆసుపత్రి కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌తో పాటు తాలా పీఎస్ మాజీ ఆఫీసర్ ఇన్‌ఛార్జి అభిజిత్‌ను అరెస్టు చేశారు. వారు సాక్ష్యాలను తారుమారుచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరికి కోర్టులో బెయిల్ దక్కింది.
Kolikapudi: క్రమశిక్షణ కమిటీతో భేటీ అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి కీలక వ్యాఖ్యలు