రైల్లో రిస్కీ స్టంట్: ప్రాణాలు కోల్పోయిన యువకుడు

పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. ప్రమాదం అని తెలిసినా.. రిస్కీ స్టంట్‌లు చేస్తారు. తాజాగా ఓ యువకుడు రైలులో డేంజరస్ ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబర్ 26న ముంబైలో చోటుచేసుకుంది.
వివరాలు.. కదులుతున్న రైల్ లో డోర్ దగ్గర నిల్చుని బయటకు వేలాడుతూ రిస్కీ స్టంట్ చేశాడో. ఈ స్టంట్ కాస్తా అదుపు తప్పి ప్లాట్‌ఫాం మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు. జరిగిన విషయమంతా అతని స్నేహితులు వీడియో తీసారు. దీంతో స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సబంధించిన వీడియోను ట్వీట్ చేసింది.
ఈ ప్రమాదంలో దిల్షాన్ అనే యువకుడు మరణించాడని తెలిపాడు. రైలులో ఇలాంటి స్టంట్స్ చేయద్దు, ఇది చట్టవిరుద్ధం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని ప్రయాణికులను హెచ్చరించింది. భద్రతను పట్టించుకోకుండా, కదిలే రైలు ఎక్కడం, కదిలే రైలులో స్టంట్లు, వింతప్రయోగాలు లాంటివి చేయొద్దని సూచించింది.
ट्रेन में स्टंट ना करें ये गैरकानूनी है एवं जानलेवा भी सिद्ध हो सकता है।
मुंबई में 26 दिसंबर को दिलशान नाम का युवक ट्रेन के बाहर लटक कर स्टंट करते हुए अपनी जान गंवा चुका है।
अपनी सुरक्षा की अवहेलना करके ट्रेन के बाहर लटकना,चलती ट्रेन में चढ़ना, हादसे का बुलावा हो सकता है। pic.twitter.com/oGEsqjoka6
— Ministry of Railways (@RailMinIndia) December 30, 2019