Romance On Bike : రన్నింగ్ బైక్‌పై అసభ్యకర చేష్టలతో రెచ్చిపోయిన ప్రేమజంట.. ప్రియుడు చెప్పిన కారణం విని పోలీసులు షాక్

బిలాయ్ లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న బైక్ పై రొమాన్స్ చేసింది. నడిరోడ్డుపై వాహనాల రద్దీగా ఉన్న సమయంలో ఆ జంట రొమాన్స్ లో మునిగితేలింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కొందరు దీన్ని వీడియో తీశారు.

Romance On Bike : రన్నింగ్ బైక్‌పై అసభ్యకర చేష్టలతో రెచ్చిపోయిన ప్రేమజంట.. ప్రియుడు చెప్పిన కారణం విని పోలీసులు షాక్

Updated On : January 23, 2023 / 9:33 PM IST

Romance On Bike : చేస్తున్నది తప్పు అని తెలుసు. ప్రాణాలకు ప్రమాదం అని కూడా తెలుసు. అయినా రన్నింగ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేయడం మాత్రం మానడం లేదు. ట్రెండ్ అనుకున్నారో లేక థ్రిల్ అనుకున్నారో లేక ఫ్యాషన్ అనుకున్నారో కానీ.. కొందరు ప్రేమికులు బరి తెగిస్తున్నారు.

నడి రోడ్డుపై రద్దీగా ఉన్న ప్రాంతంలో రన్నింగ్ బైక్ పై అసభ్యకర చేష్టలతో, అశ్లీల భంగిమలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కౌగిలింతలు, లిప్ లాక్ లతో రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోయాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి.. అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని అంతా చూస్తుండగానే విచ్చలవిడిగా ప్రవర్తించడం ఫ్యాషన్ గా మారిపోయింది.

తాజాగా ఛత్తీస్ గఢ్ లోని బిలాయ్ లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న బైక్ పై రొమాన్స్ చేసింది. నడిరోడ్డుపై వాహనాలు రద్దీగా ఉన్న సమయంలో ఆ జంట రొమాన్స్ లో మునిగితేలింది. బైక్ నడుపుతున్న యువకుడు తన ప్రియురాలిని తనకు ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. ఓవైపు బైక్ నడుపుతూనే మరోవైపు రొమాన్స్ చేశాడు. ఇద్దరూ హగ్గులు, కిస్సుల్లో మునిగి తేలారు. ఆ సమయంలో ఆ రోడ్డుపై వాహనాల రద్దీ ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా ఘోర ప్రమాదం జరగడం ఖాయం.

Also Read..Couple Romance On Scooter : హవ్వ.. నడిరోడ్డులో రన్నింగ్ బైక్‌పై అసభ్యకర చేష్టలు.. బుద్ధి చెప్పిన పోలీసులు

ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కొందరు ఈ జంట రొమాన్స్ ను వీడియో తీశారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే, ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ జంట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నడిరోడ్డుపై ప్రమాదకరంగా బైక్ నడపడమే కాకుండా అసభ్యకర చేష్టలతో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ తోటి వాహనదారులు తీవ్రంగా మండిపడ్డారు. వారికి బుద్ధి చెప్పాల్సిందేనని పోలీసులను డిమాండ్ చేశారు.


ఈ వ్యవహారం పోలీసులను చేరింది. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ప్రేమ జంటను గుర్తించి పట్టుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఎందుకిలా చేశావ్ అని అతడిని అడిగితే.. అతడు చెప్పిన సమాధానం విని పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది.

Also Read..Romance On Bike : రెచ్చిపోయిన ప్రేమజంట-నడిరోడ్డుపై రోమాన్స్

తన మాజీ లవర్ కు బుద్ధి చెప్పడానికే తానిలా చేశానని అతడు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ బైక్ చోరీకి గురైనది. దాని అసలు ధర రూ.1.50 లక్షలు ఉంటుంది. ఆ యువకుడు దాన్ని రూ.9వేలకు కొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ బైక్ కి రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదు.

కొన్ని రోజుల క్రితం ఈ తరహా ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గాజువాకలోనూ జరిగింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ ప్రేమ జంట ఇలానే బైక్ పై రెచ్చిపోయింది. ఆ రెండు జంటలకు పోలీసులు బుద్ధి చెప్పారు.
ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా, పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. రన్నింగ్ బైక్ పై రొమాన్స్ నయా ట్రెండ్ అనుకున్నారో లేక థ్రిల్ అనుకున్నారో లేక ఫ్యాషన్ అనుకున్నారో కానీ.. ఇంకా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతుండటం ఆందోళన కలిగించే అంశం.