టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుకను పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు

చిలుక తప్పిపోయింది.. అది మామూలు చిలుక కాదు.. రాయల్ రామచిలుక.. స్కైప్ లో చాటింగ్ చేస్తుంది.. చెప్పిన పని చిటికెలో చేసేస్తుంది.. యజమాని కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది.

  • Published By: sreehari ,Published On : March 8, 2019 / 08:09 AM IST
టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుకను పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు

చిలుక తప్పిపోయింది.. అది మామూలు చిలుక కాదు.. రాయల్ రామచిలుక.. స్కైప్ లో చాటింగ్ చేస్తుంది.. చెప్పిన పని చిటికెలో చేసేస్తుంది.. యజమాని కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది.

చిలుక తప్పిపోయింది.. అది మామూలు చిలుక కాదు.. రాయల్ రామచిలుక.. స్కైప్ లో చాటింగ్ చేస్తుంది.. చెప్పిన పని చిటికెలో చేసేస్తుంది.. యజమాని కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది. అందరిని రోజు నిద్రలేపి ఇంట్లో సందడి చేసే ఆ చిలుక కొన్నిరోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. చిలుక జాడ తెలియాదాయే. చిలుక జాడ కోసం వెతకని ప్రదేశం లేదు. ప్రాణంగా పెంచుకున్న చిలుక అదృశ్యం కావడంతో యజమాని కుటుంబం చిన్నబోయింది. ఇల్లు బోసిపోయింది. తప్పిపోయిన ఈ చిలుక ఇప్పుడు యూపీలోని రామ్ పూర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.
Also Read : సోషల్ మీడియాలో కామెంట్లపై బిగ్ బాస్ కౌశల్ కంప్లయింట్

దాదాపు చిలుకకు తొమ్మిది ఏళ్లు ఉంటాయి. తప్పిపోయిన చిలుక ఇంటికి తిరిగి రావాలని యజమాని కుటుంబం చేయని పూజలు లేవు. వెళ్లని గుడి లేదు. ఇక లాభం లేదని చిలుక యజమాని సనమ్ అలీ ఖాన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. చిలుక జాడ చెప్పినవారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఎవరైతే చిలుక పట్టి తేస్తారో వారికి రూ.20వేల రివార్డు ఇస్తామంటూ ఆటో రిక్షాపై లౌడ్ స్పీకర్ తో చాటింపు వేయించారు. 

ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ.. మేం పెట్టుకున్న చిలుక ముద్దుపేరు.. మిత్తూ అలియాస్ పౌలీ. రోజూ స్కైప్ లో మా కుటుంబ సభ్యులతో చిలుక ముచ్చటించేది. ప్రతిరోజు తనకు డ్రై ఫ్రూట్స్ తీసుకరమ్మని అడిగేది’ అని ఖాన్ బాధపడుతూ చెప్పారు. చిలుక జీవితం ఆధారంగా వచ్చిన హాలీవుడ్ మూవీ (పౌలీ 1998) అప్పట్లో అవార్డు గెలుచుకుంది.
Also Read : వివాహేతర సంబంధాలకు కారణం టీవీ సీరియల్స్, సినిమాలేనా?

దీంతో అప్పటినుంచి తాము పెంచుకునే చిలుకకు.. పౌలీ అని పేరు పెట్టినట్టు తెలిపారు. తప్పిపోయిన తమ చిలుక జాడ చెబితే.. వారికి రూ.20 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించినట్టు ఖాన్ తెలిపారు. చిలుక ఫొటోలను స్నేహితులు, బంధువులు అందరి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తమ చిలుక క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. 
Also Read : అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్