Viral Pic: ఇంత చిన్న ఇంటి అద్దె నెలకు రూ.45 వేలు

ఆ ఇల్లు కూడా చాలా చిన్నగా, ఇరుకుగా, పాతగా ఉంది.

Viral Pic: ఇంత చిన్న ఇంటి అద్దె నెలకు రూ.45 వేలు

Updated On : October 4, 2024 / 2:37 PM IST

అభివృద్ధి చెందిన మహానగరాల్లో ఇళ్ల అద్దె ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. సామాన్యులే కాదు.. నెలకు రూ.లక్ష జీతం వచ్చే వారు కూడా ఆ అద్దెను చూస్తే భయపడే స్థితి ఉంటుంది.

ముంబైలో అద్దెల విషయంపై నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు. ఓ అపార్ట్‌మెంట్‌లో వన్ బెడ్‌రూమ్‌ హాల్ కిచెన్‌ (1బీహెచ్‌కే) ఇల్లు నెల అద్దె రూ.45 వేలు అని ఆ ఇంటి యజమాని బోర్డు పెట్టాడు. ఈ విషయాన్ని ఒకరు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మతుంగా ఈస్ట్ ప్రాంతంలో ఈ అపార్ట్‌మెంట్‌ ఉంది. ఆ ఇల్లు కూడా చాలా చిన్నగా, ఇరుకుగా, పాతగా ఉంది. ఈ ఇంట్లో అద్దెకు ఉండాలంటే తన రెండు నెలల జీతం కూడా సరిపోదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఆ ఇంట్లో ఉంటే గాలి కూడా ఆడదని, అటువంటి ఇంటికి రూ.45 వేల అద్దె ఎలా ఇస్తారు? ఎవరు ఇచ్చి ఉంటారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ముంబైలో ఇళ్ల రెంట్లు ఇంతగా ఉంటాయా? అంటూ కొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి ఆ ఇంటి ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్ ఏమ‌న్నారంటే?