రూ.50కోట్లు ఇస్తే మోడీని చంపేస్తా : మాజీ జవాన్ వీడియో కలకలం

తేజ్ బహదూర్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్. ఈయన మరోసారి సంచలనానికి కేంద్ర

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 04:12 AM IST
రూ.50కోట్లు ఇస్తే మోడీని చంపేస్తా : మాజీ జవాన్ వీడియో కలకలం

Updated On : May 7, 2019 / 4:12 AM IST

తేజ్ బహదూర్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్. ఈయన మరోసారి సంచలనానికి కేంద్ర

తేజ్ బహదూర్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్. ఈయన మరోసారి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. యాదవ్ కి  సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు ఎవరైనా రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని మోడీని చంపేస్తానని బహదూర్ చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఇప్పుడీ వీడియో  దుమారం రేపుతోంది. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆ వీడియలో ఓ స్నేహితుడితో బహదూర్ మాట్లాడుతున్నట్టు ఉంది. దీనిపై యాదవ్ స్పందించారు. అందులో ఉన్నది తానే అని అంగీకరించారు. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇది  రెండేళ్ల క్రితం నాటి వీడియో అని ఆయన చెప్పడంతో.. దాని విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో కలకలం రేపడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిజాలు నిగ్గు  తేల్చే పనిలో పడ్డారు. ఆ వీడియో రియలా, మార్ఫింగ్ చేసిందా అనేది త్వరలోనే తేలుస్తామని చెప్పారు. వీడియో రియల్ అయితే మాత్రం తేజ్ బహదూర్ యాదవ్ పై కఠిన చర్యలు ఉంటాయని  తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో తేజ్ బహదూర్… సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై వారణాసిలో ప్రధాని మోడీకి పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఎన్నికల అధికారులు  ఆయన దరఖాస్తుని తిరస్కరించారు. ఉద్యోగం నుంచి ఎందుకు తొల‌గించాల్సి వ‌చ్చింద‌నే కార‌ణాన్ని ఆయ‌న త‌న నామినేష‌న్ ప‌త్రాల్లో పొందుప‌ర‌చ‌లేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ప్ర‌భుత్వ ఉద్యోగి  ఉద్వాస‌న‌కు గురై, ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి వ‌స్తే, దానికి గ‌ల కార‌ణాల‌ను నామినేష‌న్ ప‌త్రాల్లో తెలపాల్సి ఉంటుంది. దీన్ని బహదూర్ విస్మ‌రించారు. ఇదే కార‌ణాన్ని చూపుతూ రిట‌ర్నింగ్ అధికారి  తేజ్ బ‌హదూర్ నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేశారు. తేజ్ బ‌హ‌దూర్ యాద‌వ్ గ‌తంలో బీఎస్ఎఫ్‌లో ప‌నిచేశారు. జవాన్లకు నాసిర‌కం ఆహారాన్ని పెడుతున్నారని ఆరోపిస్తూ.. సోషల్ మీడియాలో ఓ  వీడియో పెట్టారు. అందులో కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో సైనిక అధికారులు బహదూర్ పై చర్యలు తీసుకున్నారు. ఉద్యోగం నుంచి తొలగించారు.