Mayawati: బీజేపీ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకే ఆర్‌ఎస్‌ఎస్ ఆ పని చేస్తోంది.. బీఎస్పీ చీఫ్ మాయావతి
భారీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, హింస వంటి విపరీత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి జనాభా పాలసీ, మత మార్పిడి వంటి అంశాలను ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతోంది. వాస్తవానికి ఇది బయటికి అసమ్మతి స్వరం లాగే వినిపించినప్పటికీ.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు జరుగుతున్న ప్రణాళికాబద్ధమైన కుట్ర

RSS raising religious conversion issue to distract from BJP’s failures: Mayawati
Mayawati: అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పిదాల్ని కప్పి పుచ్చి ప్రజల ఆలోచనలను మళ్లించడానికే మతపరమైన అంశాల్ని ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతోందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి మండిపడ్డారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ మౌనంగా ఉండడం వెనుక చాలా పెద్ద వ్యూహాలు ఉన్నాయని, అవి దేశానికి అత్యంత ప్రమాదకరమని ఆమె అన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ నేతల సమ్మేళనంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
‘‘భారీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, హింస వంటి విపరీత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి జనాభా పాలసీ, మత మార్పిడి వంటి అంశాలను ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతోంది. వాస్తవానికి ఇది బయటికి అసమ్మతి స్వరం లాగే వినిపించినప్పటికీ.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు జరుగుతున్న ప్రణాళికాబద్ధమైన కుట్ర’’ అని మాయావతి అన్నారు. ‘‘బిజెపికి, ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కుట్రలో భాగంగా తదుపరి (2024) లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ ప్రచారాన్ని చేపట్టింది. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం’’ అని ఆమె అన్నారు.
ప్రతి ఎన్నికల్లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ చాలా చాకచక్యంగా అడుగులు వేస్తూ ప్రజల్ని మోసగించి రాజకీయ లబ్ది పొందుతున్నాయని, వాస్తవానికి ఆ సమయంలో ప్రజల కళ్లను మూసేసి ఓట్లేయించుకుంటున్నారని మాయావతి మండిపడ్డారు. కానీ, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం కల్పించాలని పార్టీ నేతలకు మాయావతి దిశానిర్దేశం చేశారు.
Noida: ఓయో గదుల్లో జాగ్రత్త.. కపుల్స్ రహస్య సమయాలను వీడియోలు తీస్తున్న దుండగులు