Rupee Depreciation: ఇతర కరెన్సీల కంటే మనమే బెటరంట..! రూపాయి క్షీణతపై CEA కీలక వ్యాఖ్యలు..

రూపాయి విలువ పడిపోతూనే ఉంది. గత వారాంతంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 79.79కి పడిపోయింది. మంగళవారం చరిత్రలో తొలిసారిగా 80 రూపాయలు దాటి దిగజారింది. ఈ సమయంలో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత్ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Rupee Depreciation: ఇతర కరెన్సీల కంటే మనమే బెటరంట..! రూపాయి క్షీణతపై CEA కీలక వ్యాఖ్యలు..

Rupee

Updated On : July 20, 2022 / 5:56 PM IST

Rupee Depreciation: రూపాయి విలువ పడిపోతూనే ఉంది. గత వారాంతంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 79.79కి పడిపోయింది. మంగళవారం చరిత్రలో తొలిసారిగా 80 రూపాయలు దాటి దిగజారింది. ఈ సమయంలో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత్ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ పతనం ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే తక్కువేనని ఆయన అన్నారు.

Rupee Fall affect : రూపాయి క్షీణిస్తే జరగబోయే నష్టాలేంటి ?సామాన్యుడిపై ఎటువంటి ప్రభావం పడుతుంది..?

యూరో, బ్రిటీష్ పౌండ్, జపాన్ యెన్ వంటి ఇతర ప్రధాన ప్రపంచ కరెన్సీల కంటే అమెరికా డాలర్‌తో రూపాయి విలువ క్షీణత తక్కువగా ఉందని నాగేశ్వరన్ తెలిపాురు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. US డాలర్‌తో పోలిస్తే రూపాయి, ఇతర కరెన్సీలలో క్షీణతకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ దేశ పరపతి విధానాన్ని కఠినతరం చేయడమే కారణమని ఆయన అన్నారు. భారతదేశంతో సహా వివిధ అభివృద్ధి చెందుతున్నదేశాల్లోని ఆర్థిక వ్యవస్థల నుండి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయని, దీంతో వారి దేశీయ కరెన్సీలపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. జపనీస్ యెన్, యూరో, స్విస్ ఫ్రాంక్ కరెన్సీలు బ్రిటిష్ పౌండ్ డాలర్‌తో పోలిస్తే రూపాయి కంటే చాలా ఎక్కువ క్షీణించాయని తెలిపారు.

Rupee Fall : చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలు..పతనానికి కారణమేంటీ..?

దేశీయ కరెన్సీ క్షీణతను అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ డాలర్ల ప్రవాహాన్ని తనిఖీ చేయడానికి, విదేశీ నిధులు దేశంలోకి ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నాయని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కొత్త సరళీకృత నిబంధనలను ప్రకటించింది. అంతేకాకుండా బంగారం దిగుమతులపై దిగుమతి సుంకాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ఆర్‌బీఐ కంపెనీలకు విదేశీ రుణ పరిమితిని పెంచింది. అంతేకాక విదేశీ మారక ద్రవ్య ప్రవాహాన్ని పెంచడానికి అనేక చర్యలను ప్రకటించినందున ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడుల కోసం సరళీకృత నిబంధనలను పెంచింది. ఇటీవలి నెలల్లో వడ్డీ రేట్లను కూడా పెంచింది, తద్వారా నివాసితులు, నాన్-రెసిడెంట్‌లకు భారతీయ రూపాయలను కలిగి ఉండే ఆకర్షణను పెంచింది.