Salaries on holiday: సెలవైనా జీతం సమయానికే.. ఈఎమ్ఐ కూడా అదే రోజు..
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(నాచ్) సౌకర్యం వారానికి ఏడు రోజులు అందుబాటులోకి రాబోతుంది. ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాల గురించి సమాచారం ఇస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు.

Salary
No Delay for Salary: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(నాచ్) సౌకర్యం వారానికి ఏడు రోజులు అందుబాటులోకి రాబోతుంది. ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాల గురించి సమాచారం ఇస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ఈ ఏర్పాటు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. షెడ్యూల్ చేసిన తేదీన బ్యాంకులు మూసివేసి ఉన్నా కూడా జీతం అదేరోజు అకౌంట్లో పడిపోతుంది.
అంతేకాదు ఇంటి లోన్, ఆటో లోన్ మరియు వ్యక్తిగత రుణంతో సహా ఏ రకమైన ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్(EMI) ఉన్నా.. అదేరోజున అకౌంట్ నుంచి తీయబడుతుంది. ప్రస్తుతం నాచ్ సేవలు.. బ్యాంకులు తెరిచిన రోజుల్లోనే అందుబాటులో ఉండగా.. కస్టమర్ల సేవలను మరింత బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
నాచ్ చెల్లింపుల విధానంలో జీతాలు, పింఛన్లు, వడ్డీలు, డివిడెండ్‌లు వంటి చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం వచ్చాక నాచ్ నమ్మకమైన, సమర్థవంతమైన మార్గంగా మారింది. గ్యాస్, విద్యుత్తు, టెలిఫోన్, వాటర్, వాయిదాల చెల్లింపులకు కూడా నాచ్‌నే వాడతారు. ఇప్పటికే ఆర్టీజీఎస్ అన్ని రోజులు అందుబాటులోకి రాగా.. నాచ్‌ను కూడా అన్ని రోజులు పనిచేసేలా చేస్తున్నారు.
అయితే, లోన్లు తీసుకున్న కస్టమర్లకు ఒక ప్రయోజనం ఏమిటంటే, వారు నిర్ణీత తేదీకి వారి అకౌంట్లో EMI మొత్తాన్ని కలిగి ఉండకపోతే, బ్యాంక్ సెలవుదినం మరియు EMI ఉన్న సందర్భంలో మరుసటి రోజు తీయబడుతుంది. నాచ్ సౌకర్యం ప్రతీరోజూ లభించకపోవడం వల్ల చాలా సార్లు నిపుణులు తమ జీతం, వివిధ రకాల డివిడెండ్ మరియు వారి ఖాతాలో వడ్డీని పొందలేకపోతున్నారు. జీతాలు తీసుకునేరోజు సెలవు వస్తే.. తర్వాతి రోజు వరకు ఉద్యోగస్తులు ఆగాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఇకపై ఉండదు అని ఆర్‌బీఐ చెబుతుంది.