Bharat Jodo Yatra: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’లో మళ్లీ సావర్కర్ చిత్రాలు
ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. కాగా, ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ దారి వెంట పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మాండ్యాలో ఏర్పాటు చేసిన కటౌట్లలో రాహుల్ పక్కన సావర్కర్ చిత్రాలు కనిపించాయి. ఇది కాస్త మళ్లీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి దారి తీస్తోంది.

Savarkar appears again on Bharat Jodo Yatra poster
Bharat Jodo Yatra: కర్ణాటకను చాలా రోజులుగా సావర్కర్ అంశం కుదిపివేస్తోంది. రైట్ వింగ్ కార్యకర్తలు సావర్కర్ సమర్ధనగా పోస్టర్లు అంటించడం.. కాంగ్రెస్ వ్యతిరేకిండంతో కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో రాజకీయ వాతావరణం వేడేక్కింది. అది కాస్త చల్లబడగానే విద్యార్థుల పుస్తకాల్లో సావర్కర్ బుల్బుల్ పిట్టలపై సవారీ చేశాడంటూ పద్యాలు ఉండడం మరోసారి వివాదానికి దారి తీసింది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో సావర్కర్ చిత్రాలు కనిపించి మరోసారి వివాదానికి తెరలేపాయి.
ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. కాగా, ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ దారి వెంట పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మాండ్యాలో ఏర్పాటు చేసిన కటౌట్లలో రాహుల్ పక్కన సావర్కర్ చిత్రాలు కనిపించాయి. ఇది కాస్త మళ్లీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి దారి తీస్తోంది.
కాంగ్రెస్ నేత, శాంతి నగర్ ఎమ్మెల్యే నలపాడ్ అహ్మద్ హరిస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కటౌట్లలో కర్ణాటక కాంగ్రెస్ అధినేత డీ.కే.శివకుమార్, కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యా, రాహుల్ గాంధీలతో పాటు సావర్కర్ చిత్ర పటం కూడా ఉంది. పైగా సావర్కర్ చిత్రపటం భారీ సైజులో ఉండడం గమనార్హం. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలా ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. అయితే అప్పుడు సావర్కర్ చిత్రాలపై గాంధీ చిత్రాలను అంటించారు.
Double Century In T20: టీ-20లో డబుల్ సెంచరీ.. అద్భుత ఘనత సాధించిన విండీస్ క్రికెటర్