SBI Platinum Deposits : ఎస్బీఐ బంపర్ ఆఫర్.. మరో ఏడు రోజులే..

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్బీఐ తన కస్టమర్ల కోసం ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. అదే ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్‌’. దీని కింద కస్టమర్లు 75 రోజులు

SBI Platinum Deposits : ఎస్బీఐ బంపర్ ఆఫర్.. మరో ఏడు రోజులే..

Sbi Platinum Deposits

Updated On : September 7, 2021 / 6:49 PM IST

SBI Platinum Deposits : 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్బీఐ తన కస్టమర్ల కోసం ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. అదే ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్‌’. దీని కింద కస్టమర్లు 75 రోజులు, 75 వారాలు, 75 నెల‌ల వరకు డిపాజిట్ చేసే మొత్తంపై 15 బేసిస్ పాయింట్లు వరకు అద‌నంగా వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 14 వ‌ర‌కే అమ‌ల్లో ఉంటుంది.

Apple Next iPhones : భారీగా పెరగనున్న ఐఫోన్ల ధరలు.. అసలు కారణం ఇదే!

7 రోజుల నుంచి పదేళ్ల మధ్య సాధారణ ఖాతాదారులు పొదుపు చేసే ఎఫ్‌డీలపై 3.9% నుంచి 5.4% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లు జమ చేసే డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) అదనంగా లభిస్తాయి. ఈ వడ్డీ రేట్లు 8 జనవరి 2021 నుండి అమల్లోకి రానున్నాయి.

అర్హత:
* ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్లతో సహా దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు(రూ.2 కోట్ల కంటే తక్కువ)
* కొత్త, రెన్యువల్ డిపాజిట్లు
* టర్మ్ డిపాజిట్, స్పెషల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్ లు మాత్రమే.
* ఎన్ఆర్ఈ డిపాజిట్లు (525 రోజులు, 2250 రోజులు మాత్రమే)

WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?

సాధారణ ప్రజలకు ఎస్బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు

వ్యవధి ప్రస్తుత వడ్డీ రేటు ప్రతిపాదిత వడ్డీ రేటు
75 రోజులు 3.90% 3.95%
525 రోజులు 5.00% 5.10%
2250 రోజులు 5.40% 5.55%

సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు

వ్యవధి ప్రస్తుత వడ్డీ రేటు ప్రతిపాదిత వడ్డీ రేటు
75 రోజులు 4.40% 4.45%
525 రోజులు 5.50% 5.60%
2250 రోజులు 6.20% 6.20%