Apple Next iPhones : భారీగా పెరగనున్న ఐఫోన్ల ధరలు.. అసలు కారణం ఇదే!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లు మరింత ప్రియంగా మారనున్నాయి. కొన్ని ఏళ్లుగా ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్లను సరసమైన ధరకే పెద్ద సంఖ్యలో యూజర్లకు చేరువైంది.

Apple Next iPhones : భారీగా పెరగనున్న ఐఫోన్ల ధరలు.. అసలు కారణం ఇదే!

Apple’s Next Iphones

Apple next iPhones : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లు మరింత ప్రియంగా మారనున్నాయి. కొన్ని ఏళ్లుగా ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్లను సరసమైన ధరకే పెద్ద సంఖ్యలో యూజర్లకు చేరువైంది. iPhone SE ఫోన్ తర్వాత రిలీజ్ చేసిన అన్ని ఐఫోన్ల పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీపడకుండా బడ్జెట్ ఆప్షన్లతో తక్కువ ధరకే అందిస్తు వచ్చింది ఆపిల్. గత ఏడాదిలో ఆపిల్ iPhone 12 mini వంటి తక్కువ ధర డివైజ్ లను ప్రవేశపెట్టింది. తమ టాప్ ప్రొడక్టులపై చీపర్ వెర్షన్లను ఆఫర్ చేస్తోంది. కానీ, దురదృష్టవశాత్తూ చిప్ ధరల పెరుగుదలతో రాబోయే ఏళ్లల్లో ఐఫోన్ ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి.
Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!

చిప్ కాస్ట్ పెరగడమే కారణమా? :
గత నెలలో తైవాన్ సెమికండక్టర్ తయారీ సంస్థ (TSMC) తమ సెమీకండక్టర్ ధరలను 20శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. చిప్ కండెక్టర్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో స్మార్ట్ ఫోన్లు, పీసీల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని పలు కంపెనీలు విశ్వసిస్తున్నాయి. ఆపిల్ రిలీజ్ చేయబోయే Nexe iPhones ధరలు కూడా భారగా పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇతర చిప్ మేకర్లతో పోలిస్తే.. TSMC ప్రొడక్షన్ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే 20శాతం అధిక ఉత్పత్తి చార్జీలను వసూలు చేస్తోంది. ధరల పెరుగుదలతో పాటు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. TSMC అకౌంట్ దారులకు ఆర్థిక భారం కొంత భాగాన్ని చెల్లించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో TSMC అకౌంట్ దారులను డబుల్ బుకింగ్ చేయొద్దని కోరుతోంది.
WhatsApp Tricks: వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ఇలా చదవొచ్చు!

వాస్తవానికి అవసరం కంటే ఎక్కువ చిప్స్ ఆర్డర్లు అవసరమైతే డబుల్ బుకింగ్ చేయరాదని సూచిస్తోంది. కొన్ని కంపెనీలకు చిప్ సరఫరా కొరత వేధిస్తోంది. 2021 ద్వితీయార్ధంలో మరింత చిప్ సామర్థ్యం కావాలని కోరుకుంటున్నాయని Phison Electronics CEO, chairman K.S. Pua అభిప్రాయపడ్డారు. చిప్ ధరల పెరుగుదల ఆర్డర్‌లను ప్రభావితం చేయదని అన్నారు. ధరల పెరుగుదల అధికారికంగా అక్టోబర్ 1 నుంచి అమల్లో వచ్చాయి. అంతకుముందు చిప్‌మేకర్‌తో నిబంధనలపై తాము చర్చిస్తున్నామని తెలిపారు. తద్వారా వచ్చే ఏడాది వరకు ఆపిల్ డివైజ్ ధరలపై చిప్‌ల ధరల పెంపు ప్రభావం పడదని భావిస్తున్నట్టు తెలిపారు.
WhatsApp Voice Message : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ విన్నాకే పంపొచ్చు!