Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ దమీ వాట్సాప్ అకౌంట్లో ఏదైనా ప్రత్యేకమైన కాంటాక్టు హైడ్ చేసుకోవచ్చు.

Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!

Whatsapp Will Soon Let You Hide Last Seen For A Specific Contact

WhatsApp Specific Contact : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ దమీ వాట్సాప్ అకౌంట్లో ఏదైనా ప్రత్యేకమైన కాంటాక్టు హైడ్ చేసుకోవచ్చు. తొందరలోనే ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు wabetainfo ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకూ వాట్సాప్ అకౌంట్లో Last Seen, Profile Pic, Status చూసే వీలుంది. ఈ మూడు ఆప్షన్లలో Last Seen అనే ఆప్షన్ మీ కాంటాక్టులో ఉన్న వారందరికి కనిపిస్తుంది. ఇకపై ఏ కాంటాక్టు మీ వాట్సాప్ లాస్ట్ సీన్ చూడకూడదో కంట్రోల్ చేయొచ్చు.

Sticker Heist : వాట్సాప్ నుంచి మనీ హైస్ట్ స్టిక్కర్ ప్యాక్‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ఇందులో Everyone, My Contacts, Nobody అనే ఆప్షన్లలో ఏదైనా ఒకదానిని ఎంచుకుని కాంటాక్టులను హైడ్ చేయొచ్చు. ఎవరీవన్ ఆప్షన్ ఎంచుకుంటే.. అందరూ మీ Last Seen స్టేటస్ చూడొచ్చు. అలాగే Profile pic, Status చూడొచ్చు. My contacts అని సెట్ చేస్తే.. కాంటాక్టులో ఉన్నవాళ్లు మాత్రమే చూసే వీలుంది. అదే NObody అని సెలక్ట్ చేస్తే.. మీ Last Seen ఆప్షన్ ఎవరూ చూడలేరు.

వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ఫీచర్ ప్రకారం. మీ కాంటాక్టులో ఉన్నవారిలో కూడా ఎవరూ మీ Last Seen, Profile Pic, Status చూడకుండా కంట్రోల్ చేయొచ్చు. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటో చెప్పలేదు కదా.. అదే.. My Contacts Except ఫీచర్.. ఇది మీ వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ లో అప్ డేట్ తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్లలో మాత్రమే ఈ ఫీచర్ టెస్టింగ్ చేసింది. త్వరలో వాట్సాప్ యూజర్ల అందరికి అందుబాటులోకి రానుంది.

WhatsApp : 3 మిలియన్ల వాట్సాప్ ఖాతాలు బ్లాక్