టాయిలెట్స్ క్లీన్ చేస్తున్న విద్యార్ధులు: మార్కుల కోసమా..నాలెడ్జ్ కోసమా

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 04:04 AM IST
టాయిలెట్స్  క్లీన్ చేస్తున్న విద్యార్ధులు: మార్కుల కోసమా..నాలెడ్జ్ కోసమా

Updated On : August 29, 2019 / 4:04 AM IST

గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులు టాయిలెట్లు కడుగుతున్న ఫోటోలు..వీడియో  వెలుగులోకొచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి. చదువుకునేందుకు వచ్చిన పిల్లలతో టీచర్లు టాయ్ లెట్లు క్లీన్ చేయించటమేంటంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్కూల్ హెడ్ మాస్టార్ గులాబ్ సోని మాత్రం..విద్యార్ధులకు పరిశుభ్రతపై అవగాహన కలిగించటానికే ఇలా చేసామంటున్నారు. కానీ విద్యార్థులు టాయిలెట్లు శుభ్రం చేస్తే మార్కులు వేస్తామని టీచర్లు బెదిరించటంతోనే పిల్లలు ఆ పనిచేస్తున్నారనీ విమర్శలు వచ్చాయి. ఈ  ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా సింహారా గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ వీడియోలో పలువురు విద్యార్థులు టాయిలెట్ లోపల చీపురుతో శుభ్రం చేస్తున్న దృశ్యాలున్నాయి. వీటిని ఓ విద్యార్థి కుటుంబ సభ్యుడు ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టాయ్ లెట్లు క్లీన్ చేస్తేనే పరీక్షల్లో ఐదు మార్కులు వేస్తామని టీచర్లు అన్నారనీ..అందుకే కడుగుతున్నామనీ ఓ విద్యార్థి తనతో అన్నట్లుగా చెబుతున్నారు వీడియోను పోస్ట్ చేసిన సదురు వ్యక్తి. 

ఈ వార్తలపై ఖండ్వా జిల్లా విద్యాశాఖాధికారి తన్వీ సుందారియాను ప్రశ్నించగా..చిన్నారులకు పరిశుభ్రతపై ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇలా చేయిస్తున్నామని, ఇందులో తప్పుపట్టాల్సిందేమీ లేదంటూ సమాధానమిచ్చారు.  కాగా టాయ్ లెట్లు శుభ్రం చేస్తేనే పరీక్షల్లో మార్కులు వేస్తామని స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పటంతోనే విద్యార్థులు విధిలేక టాయ్ లెట్లు శుభ్రం చేస్తున్నారనే విమర్శలు కొనసాగుతుండటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కొన్ని రోజుల క్రితం స్కూల్ విద్యార్థులు మధ్యాహ్నా భోజనం చేసిన తరువాత వంటపాత్రలను బురద నీటితో కడుగుతున్న దృశ్యాలు కూడా విమర్శలకు దారి తీశాయి.