Mega Himalayan Earthquake : మూడు రోజుల్లో రెండు భూకంపాలు…భారీ భూకంపానికి హెచ్చరికలా? శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే…

కేవలం మూడు రోజుల్లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంత దేశంలో భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని భూకంప శాస్త్రవేత్త, నేషనల్ సొసైటీ ఫర్ ఎర్త్‌క్వేక్ టెక్నాలజీ-నేపాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డాక్టర్ అమోద్ దీక్షిత్ హెచ్చరించారు.....

Mega Himalayan Earthquake

Mega Himalayan Earthquake : నేపాల్‌లో మెగా హిమాలయన్ భూకంపంపం సంభవించనుందా? అంటే అవునంటున్నారు భూకంప శాస్త్రవేత్తలు….ఇటీవల కేవలం మూడు రోజుల్లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంత దేశంలో భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని భూకంప శాస్త్రవేత్త, నేషనల్ సొసైటీ ఫర్ ఎర్త్‌క్వేక్ టెక్నాలజీ-నేపాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డాక్టర్ అమోద్ దీక్షిత్ హెచ్చరించారు. ఇటీవలి ప్రకంపనల తర్వాత నేపాల్‌లో పెద్ద భూకంపం వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Also Read :  Blast by Naxals : ఛత్తీస్‌‌ఘడ్ సుక్మా జిల్లాలో నక్సల్స్ పేలుడు…సీఆర్‌‌పీఎఫ్ జవానుకు గాయాలు

సోమవారం నేపాల్‌లో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. 2015 నుంచి నేపాల్ దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం తాజాగా సంభవించింది. ఈ భూకంపం వల్ల 153 మంది మరణించిన కొద్ది రోజులకే, మరో స్వల్పంగా భూకంపం రావడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నవంబర్ 5 వతేదీన సంభవించిన భూకంపం వల్ల ఖాట్మండు, ఢిల్లీ వరకు కూడా కొండచరియలు విరిగిపడటం, ఇళ్ళు, రోడ్లు,మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తే ఆప్ ఏం చేయనుందంటే…

ఆదివారం నాటి భూకంపం ఈ ప్రాంతంలోని అన్ని ఒత్తిడిని విడుదల చేసి ఉండకపోవచ్చని, మరింత పెద్ద,విధ్వంసక భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి నిరంతరం నెట్టడం, క్రస్ట్‌లో ఒత్తిడిని సృష్టించడం వల్ల భూకంపం సంభవించిందని డాక్టర్ అమోద్ దీక్షిత్ చెప్పారు. ఒత్తిడి కాలక్రమేణా పేరుకుపోతుందని, దీనివల్ల క్రమానుగతంగా భూకంపాల రూపంలో విడుదలవుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

Iranian Nobel laureate Narges Mohammadi : నోబెల్ బహుమతి గ్రహీత నర్గెస్ జైలులో నిరాహార దీక్ష…ఎందుకంటే…

ఆదివారం నాటి భూకంపం ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేసిందని ఆయన చెప్పారు. 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సృష్టించడానికి తగినంత ఒత్తిడి ఉందని, అది ఎప్పుడైనా సంభవించవచ్చని దీక్షిత్ అంచనా వేశారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ దీక్షిత్ కోరారు. భూకంపం ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఉన్న జనాభాను తరలించలేమని చెప్పారు. భూకంపం సమయంలో సురక్షితమైన, బహిరంగ స్థలాన్ని కనుగొనడం వంటి భూకంప భద్రతా మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని ఆయన సూచించారు.

Drunk school teacher : పీకలదాకా మద్యం తాగి తరగతి గదిలో నిద్రపోయిన టీచర్…ఆపై ఏం జరిగిందంటే…

డాక్టర్ దీక్షిత్ భారీ భూకంపం ముప్పు హెచ్చరికకు నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ చీఫ్ డాక్టర్ లోక్ బిజయ అధికారి వంటి ఇతర భూకంప నిపుణులు కూడా మద్ధతు ఇచ్చారు. నేపాల్ ఇప్పటికీ భూకంప చురుకైన జోన్‌లో ఉందని, మరిన్ని భూకంపాలు అనివార్యమని లోక్ విజయ చెప్పారు. ఆదివారం నాటి భూకంప ప్రకంపనలు, భూకంప చర్యలను ఎన్‌ఎస్‌సి పర్యవేక్షిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

బంగాళాఖాతంలో మళ్లీ భూకంపం

బంగాళాఖాతంలో సోమవారం మళ్లీ భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.