హోటల్ లో ఫుడ్ బాలేదని…ఘోరంగా కొట్టుకున్నారు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఓ హోటల్ లో పెద్ద యుద్ధమే జరిగింది. కస్టమర్లు ఓ హోటల్ లోని వంటగదిలోకి ప్రవేశించి.. క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదని హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
భోపాల్ లో సోమవారం (అక్టోబర్ 28, 2019)న రాత్రి హోటల్ సిబ్బందికి, కస్టమర్లకు మధ్య పెద్ద గొడవ జరిగింది. క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదని హోటల్ సిబ్బందిని నిలదీశారు. దీంతో వారిద్దరి మధ్య మాటకు మాట పెరగడంతో గొడవ పెద్దదిగా మారి కొట్టుకునే వరకు వచ్చింది.
అయితే ఈ గొడవంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక అక్కడే ఉన్న వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH Madhya Pradesh: Scuffle broke out between customers & staff at a restaurant in Bhopal, allegedly after customers complained of poor quality food at the restaurant. (28.10.2019) pic.twitter.com/9w5HptMk1o
— ANI (@ANI) October 30, 2019