Security Guard : అలుపెరగని భగీరథుడు.. 25ఏళ్లలో 23సార్లు ఫెయిల్.. 56ఏళ్లకు ఎంఎస్సీ పాసయ్యాడు!

Security Guard : అలుపెరగని భగీరథుడు.. 25ఏళ్లలో 23సార్లు ఫెయిల్.. 56ఏళ్లకు ఎంఎస్సీ పాసయ్యాడు!

Security guard clears MSc exam at the age of 56, after 23 failures in 25 years

Updated On : November 28, 2023 / 9:23 PM IST

Security Guard : ప్రయత్నిస్తే పోయేది ఏముంది ఓటమి తప్ప.. అలా ప్రతి ఓటమిని స్పూర్తిగా తీసుకున్నాడు. ధైర్యంగా ముందుకు సాగాడు. చివరికి అనుకున్న గమ్యాన్ని చేరుకున్నాడో మధ్యప్రదేశ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు.. అతడే.. రాజ్‌కరన్ బారువా. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. నెలకు అతడి సంపాదన రూ.5వేలు మాత్రమే.. తన జీవితంలో ఎన్నిసార్లు ఓటమి వెక్కిరించినా వెనుకంజ వేయలేదు.

56ఏళ్ల వయస్సులో కల నెలవేరింది :
అదే ధైర్యంతో ముందుకు సాగాడు. 56ఏళ్ల వయస్సులో తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ ఏడాదిలో జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి యూనివర్శిటీ నుంచి గణితశాస్త్రంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందాడు. ఒకవైపు సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఇళ్లలో పనిమనిషిగా కూడా చేశాడు. ఖాళీ దొరికినప్పుడల్లా చదవుకుంటూ ఎంఎస్సీ డిగ్రీ పాసయ్యాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు బారువా.. ఇతగాడి చేతిలో ఇప్పుడు రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి.

Read Also : Viral Video : హైదరాబాద్‌కు డిస్నీ ల్యాండ్ తీసుకురండి.. చిన్నారి రిక్వెస్ట్‌కి కేటీఆర్ ఏం చెప్పారంటే?

25ఏళ్లలో 23సార్లు విఫలయత్నం.. :
56ఏళ్ల కష్టతరమైన ప్రయాణం పావు శతాబ్దానికి పైగా సాగింది. 1996లో ఆర్కియాలజీలో తన మొదటి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. కానీ, అతడిలో ఇలా సాధించాలనే పట్టదల కనిపించింది. గణితంలో కూడా ప్రావీణ్యం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కొంచెం కూడా అధైర్యపడకుండా గణితంలో ఎంఎస్సీ చదివాడు.

ఇలా తన కలను నెరవేర్చుకోవడానికి బారువాకు 25ఏళ్లు పట్టింది. ఈ 25ఏళ్లలో 23సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలను కొనసాగించాడు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే పగటిపూట పనికి వెళ్లేవాడు. ఖాళీ సమయాల్లో ఎంఎస్సీ పరీక్ష కోసం ప్రీపేర్ అయ్యాడు. 1997లో మొదటిసారిగా ఎంఎస్సీ పరీక్షకు రాయగా ఫెయిల్ అయ్యాడు. ఆ తరువాత 10 ఏళ్లలో 5 సబ్జెక్టులలో ఒక సబ్జెక్టులో మాత్రమే బారువా పాస్ అయ్యాడు.

Security guard clears MSc exam at the age of 56, after 23 failures in 25 years

Security guard MSc exam

ఫైనల్స్‌లో ఒకేసారి అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు :
అయిన అలుపెరగని భగీరథుడిలా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఎట్టకేలకు 2020లో మొదటి సంవత్సరం ఎంఎస్సీ పరీక్షలో పాస్ అయ్యాడు. రెండో సంవత్సరం 2021లో మొత్తం సబ్జెక్టులను పూర్తి చేశాడు. బారువా తాను ఎంఎస్సీ పరీక్షకు ఎలా ఎలా సిద్ధమయ్యాడో జాతీయ మీడియాతో చెప్పుకొచ్చాడు.

మొదట్లో ఆంగ్లంలో పుస్తకాలపై ఆధారపడ్డాడు. కానీ, భాషా అవరోధం అడ్డంకిగా మారింది. అయినప్పటికీ పట్టువదల్లేదు. ఇంగ్లీషులో పుస్తకాల ద్వారా చదువకున్నాడు. డిక్షనరీ సాయంతో చదివాడు. ఒక్క సబ్జెక్టులో తప్ప మిగతా సబ్జెక్ట్‌లలో ఫెయిల్‌ అవుతూనే ఉన్నాడు. కానీ 2021లో చివరికి పాసయ్యాడు. ఒక భారతీయ రచయిత రాసిన ఇంగ్లీష్ పుస్తకం చదివి ఫైనల్స్‌ అన్ని ఒకేసారి ఉత్తీర్ణులయ్యానని జబల్‌‌‌పూర్ నివాసి తెలిపాడు.

కన్న కలలతోనే వివాహం : 
బంగ్లాలలో పని చేస్తూ, గుడిసెలలో ఉంటూ ఎన్నోసార్లు అవమానాలకు గురయ్యాను. సౌకర్యాలు లేకుండా చదువుకుంటే ఎందుకు కుదరదు అని యజమానులు తమ పిల్లలను చాలాసార్లు వెక్కిరిస్తూ ఉంటారు. అందుకే నేను ఎవరికీ నా ప్రయత్నాల గురించి చెప్పలేదు.

మా యజమానులు నాతో పరుషంగా మాట్లాడేవారు. నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రాత్రి మెట్ల మీద కూర్చుని చదువుకునేవాడిని. వారు నన్ను ఏదైనా పనికి పిలిచినప్పుడు వెళ్లేవాడిని’ అంటూ బారువా గుర్తు చేసుకున్నాడు. 56ఏళ్లలో ఎందుకు వివాహం చేసుకోలేదని అడిగిన ప్రశ్నకు తన కలలను తాను వివాహం చేసుకున్నానని బదులిచ్చాడు.

Read Also : Telangana Elections 2023 : ఓటు హక్కును వినియోగించుకోమని పిలుపునిస్తున్న సెలబ్రిటీలు