Viral Video : ముంబై ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.. నెటిజన్లు ఆగ్రహం!

Viral Video :ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Viral Video : ముంబై ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.. నెటిజన్లు ఆగ్రహం!

Woman's Dance At Mumbai Airport ( Image Credit : ( image posted on X by @desimojito )

Viral Video : మెట్రో రైళ్లు, రైలు ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేసే ధోరణి ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇలాంటి ఘటనలపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై స్పందించిన అనేక మంది నెటిజన్లు ఆ యువతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also : TATA IPL 2024 : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 62 కోట్లకుపైగా వ్యూస్‌తో జియోసినిమా సరికొత్త రికార్డు..!

ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న యువతిని కొంతమంది అలానే చూడగా, మరికొందరు ఆమెను పట్టించుకోలేదు. కురుక్షేత్రలో ‘ఆప్ కా ఆనా’ పాటలో సల్వార్ కుర్తా ధరించి డ్యాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ‘వైరస్ విమానాశ్రయాలకు చేరుకుందని యూజర్ ఆ వీడియోను షేర్ చేశారు. దీనికి కొంతమంది నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.

మరికొందరు పెరుగుతున్న ఈ ట్రెండ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ‘మానవత్వం, తెలివి ఎక్కడికి పోతోంది? అని ఒక యూజర్ కామెంట్ చేయగా ‘వారిలాంటి వారికి కఠినమైన చట్టాలు, శిక్షలు అవసరం.. ప్రతి ప్రదేశాన్ని సర్కస్‌గా మార్చారని మరో యూజర్ తిట్టిపోశాడు.

అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివారిని నిషేధించాలని ప్రధాని మోదీని నేను కోరుతున్నానని మరో యూజర్ పోస్టు చేశాడు. విమానాశ్రయంలో ఇలాంటి వ్యక్తులను వెలుపలికి వెళ్లకుండా చూసుకోవాలి. టైమ్ పాస్, వినోదం కోసం కాకుండా వ్యాపారం కోసం విమానాశ్రయాలను సందర్శిస్తారు. అప్పుడు ఇలాంటివి చూడటం విసుగు తెప్పిస్తుందని నెటిజన్లు విమర్శించారు. ఇప్పటివరకు దీనిపై ఏ అధికార యంత్రాంగం స్పందించలేదు.

గతంలో ముంబైలో కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ఓ యువతి భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేయడం కలకలం రేపింది. వీడియోలలో, యువతి ముంబై లోకల్ రైళ్లలోని జనరల్, లేడీస్ కోచ్‌లలో సీఎమ్‌ఎస్‌టీ స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లో రెచ్చగొట్టే విధంగా డ్యాన్స్ చేస్తూ ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది.

Read Also : Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లివే.. ధర, వ్యాలిడిటీ వివరాలివే!