Karnataka Govt Officer kill : హత్యకు గురైన కర్ణాటక ప్రభుత్వ అధికారిణి ఇటీవలే కొన్ని ప్రదేశాలపై దాడులు చేశారు : ప్రతిమ సహోద్యోగి

ప్రతిమ చాలా డైనమిక్ లేడీ అని, అంతేకాదు చాలా ధైర్యవంతురాలు కూడా అని సీనియర్ అధికారి దినేష్ విలేకరులకు తెలిపారు. తనిఖీలు చేయడం లేదా మరేదైనా విషయాల్లోనైనా ఆమె డిపార్ట్‌మెంట్‌లో గొప్ప ఖ్యాతిని సంపాదించారని కొనియాడారు.

Karnataka Govt Officer kill : హత్యకు గురైన కర్ణాటక ప్రభుత్వ అధికారిణి ఇటీవలే కొన్ని ప్రదేశాలపై దాడులు చేశారు : ప్రతిమ సహోద్యోగి

Karnataka govt officer Pratima kill

Updated On : November 6, 2023 / 9:50 AM IST

Karnataka Govt Officer Pratima Kill : కర్ణాటక ప్రభుత్వ అధికారిణి ప్రతిమ కెఎస్(45) బెంగళూరులోని తన ఇంట్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి బెంగళూరులోని సుబ్రహ్మణ్యపొరలోని తన నివాసంలో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ప్రతిమ కెఎస్ బెంగళూరులోని సుబ్రహ్మణ్యపొరలోని తన ఇంట్లో కత్తితో పొడిచి హత్య గావించబడ్డారు.

ఆ సమయంలో ఆమె భర్త, కొడుకు బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలోని శివమొగ్గ జిల్లాలో ఉన్నారు. ప్రతిమ మృతి పట్ల ఆమె సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధైర్యసాహసాలు కలిగిన అధికారిణి ప్రతిమ ఇక లేరని బాధపడ్డారు. కర్ణాటక పర్యావరణ శాఖ సీనియర్ అధికారి విలేకరులతో మాట్లాడుతూ ప్రతిమ చాలా డైనమిక్ లేడీ అని, ఆమె కష్టపడి పని చేస్తూ డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు.

Pratima: భర్త, కుమారుడు ఇంట్లో లేని సమయంలో దారుణ హత్యకు గురైన ప్రభుత్వ అధికారిణి

ప్రతిమ చాలా డైనమిక్ లేడీ అని, అంతేకాదు చాలా ధైర్యవంతురాలు కూడా అని సీనియర్ అధికారి దినేష్ విలేకరులకు తెలిపారు. తనిఖీలు చేయడం లేదా మరేదైనా విషయాల్లోనైనా ఆమె డిపార్ట్‌మెంట్‌లో గొప్ప ఖ్యాతిని సంపాదించారని కొనియాడారు. అయితే ఆమె ఇటీవల కొన్ని ప్రదేశాలపై దాడి చేశారని అన్నారు. ఆమెకు శత్రువులెవరూ లేరని పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఆమె తన పనిని చక్కగా చేసి గొప్ప పేరు సంపాదించారని తెలిపారు.

బెంగళూరు గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ప్రతిమ శివమొగ్గలోని ఓ కళాశాలలో ఎంఎస్సీ చేశారు. ఆమె బెంగళూరులోని రాంనగర్‌లో ఏడాది కాలంగా ఉద్యోగం చేస్తున్నారు. అధికారిణి ప్రతిమను ప్రభుత్వ కార్యాలయం నుంచి డ్రైవర్ తీసుకెళ్లి ఆమె ఇంటికి దగ్గర దింపి వెళ్లిపోయాడు. తర్వాత రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రతిమ హత్యకు గురైనట్లు సమాచారం.

Nepali Woman Killed : పెళ్లి చేసుకోవాలని అడిగిన నేపాలీ మహిళను హత్య చేసిన ఆర్మీ అధికారి

శనివారం ప్రతిమ సోదరుడు ఆమెకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో మురుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున సోదరుడు ఆమె ఇంటికి వచ్చి చూడగా ప్రతిమ శవమై కనిపించింది. వెంటనే అతను పోలీసులను సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ మరియు సాంకేతిక బృందాలు సంఘటనా స్థలంలో పని చేస్తున్నాయని పోలీసు అధికారి రాహుల్ కుమార్ షహపూర్వాడ్ మీడియాకు తెలిపారు.

విచారణ కోసం మూడు బృందాలు ఏర్పాటు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నారని పేర్కొన్నారు. ఏం జరిగిందో తాము కచ్చితంగా తెలుసుకున్న తర్వాత మరిన్ని వివరాలను తెలియజేస్తామని చెప్పారు. ఈ హత్యపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.