150 ఏళ్ల చరిత్ర కలిగిన చర్చిలో 35 ఏళ్ల తరువాత మోగనున్నగంట

క్రిస్మస్ పండుగ వచ్చేసింది. క్రైస్తవులంతా పండుగ వేడుకలను సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 35 సంవత్సరాల తరువాత తెరుచుకున్న ఓ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. 35 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఈ చర్చిలో చారిత్మాత్మక ఆరాధన బెల్ మోగనుంది. సిమ్లాలో ఉన్న 150 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రైస్ట్ చర్చిలో గంటకు చాలా చరిత్ర ఉంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఈ చర్చిలో ప్రార్థనలు జరిగేవి. ఈ చర్చిలో ఉండే గంట గత 35 ఏళ్ల నుంచి పనిచేయటంలేదు. దీంతో ఇటీవల స్థానికంగా ఉండే విక్టర్ డెన్ అనే ఓ మెకానికల్ ఇంజనీర్ ఆ గంటను బాగు చేయించాడు. దీనికోసం అతను 20రోజుల పాటు కష్టపడ్డాడు.
ఈ సందర్భంగా విక్టర్ మాట్లాడుతూ..క్రైస్ట్ చర్చిలో గంట మోగకపోవటంతో స్థానికులంతా ఓ వెలితిగి లోనవుతున్నారనీ..ఈ చర్చితో స్థానికులకు ఎనలేని అనుబంధం..జ్నాపకాలు ఉన్నాయనీ..ఈ చర్చిలో స్థానికుల పిల్లలు ఆడుకునేవారు..పాడుకునేవారు. ఆదివారం అయిదంటే చాలు పిల్లలంతా చర్చికి వచ్చి శ్రద్ధగా ఫాదర్ చెప్పే ప్రసంగాన్ని వినేవారనీ..చర్చి గంట సౌండ్ కు పిల్లలే కాక పెద్దలు కూడా చాలా అలవాడు పడి ఉన్నారు. కానీ అది గత 35ఏళ్లనుంచి చర్చి గంట మూగబోయింది. మరమత్తులకు కూడా నోచుకోలేదనీ..కానీ ఈ ఏడాది క్రిస్మస్ నాటికి ఎలాగైనా క్రైస్ట్ చర్చి గంట మోగాలనే ఉద్ధేశంతో గంట మరమత్తుల బాద్యత తాను తీసుకున్నానని చెప్పాడు.
గంటను తిరిగి బాగు చేయించటానికి ఛత్తీస్ గఢ్ నుంచి కొంత మెటీరియల్ ను కొనుగోలు చేశానని తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినం అయిన క్రిస్మస్ రోజును క్రైస్ట్ చర్చి గంట మోగుతుందని తెలిపారు. క్రైస్తవ వర్గాలు చర్చి గంట సౌండ్ వినటానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని విక్టర్ తెలిపారు.
1857లో సిమ్లాలో ఈ క్రైస్ట్ చర్చిని నిర్మించారనీ..ఈ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి క్రైస్తవులు వస్తుంటారని తెలిపారు. సిమ్లా వచ్చిన విదేశీ పర్యాటకులు కూడా ఈ చర్చికి వస్తారని 150 సంవత్సరాల చరిత్ర ఈ క్రైస్ట్ చర్చికి ఉందని తెలిపారు. కాగా..దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి మూగ బోయిన సిమ్లాలోని క్రైస్ట్ చర్చి గంట క్రిస్మస్ పండుగ సందర్భంగా మోగనుంది. దీని గంట సౌండ్ కోసం క్రైస్తవులతో పాటు స్థానికంగా ఉండే క్రైస్తవేతరులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో మతసామరస్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారతదేశం సొంతం.