Human Skull : షాకింగ్.. ప్రయాణికురాలి బ్యాగులో పుర్రె, ఎయిర్ పోర్టులో కలకలం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కబోతున్న ప్రయాణికురాలి బ్యాగులో పుర్రె కనిపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ విమానం ఎక్కబో

Human Skull : షాకింగ్.. ప్రయాణికురాలి బ్యాగులో పుర్రె, ఎయిర్ పోర్టులో కలకలం

Human Skull

Updated On : September 8, 2021 / 11:42 PM IST

Human Skull : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కబోతున్న ప్రయాణికురాలి బ్యాగులో పుర్రె కనిపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ విమానం ఎక్కబోతున్న సమయంలో అధికారులు ఆమెను ఆపి బ్యాగు తనిఖీ చేయగా.. అందులో పుర్రె లభ్యమైంది. దీంతో అధికారులు, తోటి ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ప్రయాణికురాలిని ఉజ్జయినికి చెందిన సాధ్వీ యోగ మాతగా గుర్తించారు పోలీసులు. పుర్రె గురించి అధికారులు ఆరా తీశారు.

ఆ పుర్రె చనిపోయిన తన గురువదని, పుర్రెను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ తీసుకెళ్తున్నట్టు యోగమాత సమాధానం ఇచ్చింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుని ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, విమానం ఎక్కేందుకు విమాన సిబ్బంది ఒప్పుకోలేదు. పుర్రెతో ప్రయాణం చేసేందుకు ఆమె పర్మిషన్ తీసుకోని కారణంగా ఆమెని విమానం ఎక్కనివ్వలేదు. కాగా పుర్రె కనిపించడంతో ఎయిర్ పోర్టులో కాసేపు కలకలం రేగింది. ఇతర ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు.