డబ్బున్నోళ్లకు మాత్రమే : ట్రైన్ 18లో దిమ్మతిరిగే ధరలు

ట్రైన్ 18.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ రైలుపైనే. ఇందుకు కారణం దీని స్పీడ్. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో జెట్ స్పీడ్‌తో ఈ రైలు పరుగులు తీస్తుంది. ఇండియన్ రైల్వే

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 07:38 AM IST
డబ్బున్నోళ్లకు మాత్రమే : ట్రైన్ 18లో దిమ్మతిరిగే ధరలు

Updated On : January 27, 2019 / 7:38 AM IST

ట్రైన్ 18.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ రైలుపైనే. ఇందుకు కారణం దీని స్పీడ్. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో జెట్ స్పీడ్‌తో ఈ రైలు పరుగులు తీస్తుంది. ఇండియన్ రైల్వే

ట్రైన్ 18.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ రైలుపైనే. ఇందుకు కారణం దీని స్పీడ్. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో జెట్ స్పీడ్‌తో ఈ రైలు పరుగులు తీస్తుంది. ఇండియన్ రైల్వే ప్రవేశపెడుతున్న.. ‘ట్రైన్ 18’ త్వరలో పట్టాలపై దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఈ రైలు రాక కోసం అంతా ఈగర్‌గా చూస్తున్నారు. ఒక్కసారైనా ఈ ట్రైన్ ఎక్కాలని సరదా పడతున్నారు. అయితే ట్రైన్ 18 టికెట్ ధరలకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ట్రైన్ 18 టికెట్ ధరలు ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.

 

* అధికారుల నివేదిక ప్రకారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలకన్నా 50శాతం ఎక్కువగా ట్రైన్-18 టికెట్ ధరలు ఉండనున్నాయి.
* ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ఫేర్ రూ.2వేల 800 నుంచి రూ.2వేల 900 వరకు ఉండే ఛాన్స్
* ఛైర్ కార్ టికెట్ ఫేర్ రూ.1600 నుంచి రూ.1700 వరకు ఉండే ఛాన్స్

 

ఈ టికెట్ ధరలు విని మధ్య తరగతి ప్రయాణికులు షాక్ అవుతున్నారు. మరీ ఇంత కాస్ట్లీలానా అని విస్తుపోతున్నారు. ట్రైన్ 18 ఎక్కాలంటే జేబులు గుళ్ల చేసుకోవాల్సిందే అంటున్నారు.

 

ట్రైన్ 18 విశేషాలు:

* ఈ రైలుకి ఇంజిన్ ఉండదు
* చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)‌లో ట్రైన్ 18ను దేశీ పరిజ్ఞానంతో తయారీ.
* ఢిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు
* బడ్జెట్ పెట్టిన తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం
* 755 కిలోమీటర్ల దూరం 8గంటల్లోనే కవర్
* కాన్పూర్, ప్రయాగ్ రాజ్‌లో ఆగనున్న రైలు
* అటోమేటిక్ డోర్లు
* ఆన్‌బోర్డు వైఫై
* ఇన్ఫోటెయిన్‌మెంట్
* జీపీఎస్ బేస్డ్ పేసేంజర్ ఇన్ఫర్మేషన్
* బయో వ్యాకూమ్ సిస్టమ్‌తో కూడిన ఆధునిక టాయిలెట్లు
* ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఢిల్లీ-భూపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఇది గంటకు 155కిమీల వేగంతో దూసుకెళ్తుంది.